Share News

రావణ దహనంలో అపశ్రుతి.. జనాలపైకి దూసుకొచ్చిన బాణసంచా.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 21 , 2026 | 08:43 PM

దసరా వేడుకల్లో రావణ దహనం చేస్తుండగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. రావణుడి దిష్టిబొమ్మకు నిప్పంటించగానే బాణసంచా జనసమూహం వైపు దూసుకెళ్లడంతో ప్రజలు భయంతో పరుగులు తీశారు.

రావణ దహనంలో అపశ్రుతి.. జనాలపైకి దూసుకొచ్చిన బాణసంచా.. వీడియో వైరల్
Dussehra Celebration

ఇంటర్నెట్ డెస్క్: దసరా వేడుకల్లో భాగంగా రావణుడి దిష్టిబొమ్మను దహనం చేస్తుండగా అనూహ్య ఘటన చోటుచేసుకుంది. దిష్టిబొమ్మకు నిప్పంటించగానే అందులో అమర్చిన బాణసంచా ఒక్కసారిగా పేలుతూ ప్రేక్షకుల వైపు దూసుకెళ్లింది. దీంతో అక్కడున్న ప్రజలు భయాందోళనలకు గురై ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీశారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే రావణ దహన వేడుక.. బాణసంచా కారణంగా గందరగోళంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


ఈ వీడియో @gharkekalesh అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోకు 1.5 కోట్లకు పైగా వీక్షణలు, 9,000కు పైగా కామెంట్లు వచ్చినట్లు సమాచారం. అయితే..వీడియో చూసిన నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ ‘నిజంగా రావణుడికి కోపం వచ్చిందా?’ అని, ‘యుద్ద వాతావరణం కనిపిస్తోంది’ అని ఒకరు, ‘రావణుడు జనాలపైకి నిప్పుల బాణాలు వేస్తున్నట్లు ఉంది’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు. మొత్తానికి, ఆనందంగా జరగాల్సిన దసరా వేడుకలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట చర్చనీయాంశంగా మారింది.


ఈ వార్తలు కూడా చదవండి..

కేంద్ర నిధులను అడ్డుకునేందుకే వైసీపీ కుట్రలు: ఎమ్మెల్యే కోటంరెడ్డి

స్థానిక ఎన్నికల్లో 90 శాతానికి పైగా స్థానాలు కూటమి అభ్యర్థులు కైవసం: దేవినేని ఉమా

For More AP News And Telugu News

Updated Date - Oct 21 , 2026 | 08:58 PM