పులుల ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు.. చివరికి..
ABN , Publish Date - Oct 13 , 2026 | 09:38 AM
ఓ వ్యక్తి అమెరికాలోని ప్రసిద్ధ యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌కు వెళ్లాడు. అక్కడ పులులను చూశాడు. ఏమనుకున్నాడో ఏమో గానీ ఒక్కసారిగా పులుల ఎన్‌క్లోజర్‌లోకి దూకేశాడు. చివరికి..
ఇంటర్నెట్ డెస్క్: తాను చేసిన ఒక్క పని వల్ల ఓ వ్యక్తి తన ప్రాణాలనే కోల్పోయాడు. అమెరికాలోని ప్రసిద్ధ యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్‌ను సందర్శించడానికి అతడు వెళ్లాడు. అక్కడ పులులను చూశాడు. ఏమనుకున్నాడో ఏమో గానీ ఒక్కసారిగా భద్రతా కంచెను దాటి నేరుగా పులుల ఎన్‌క్లోజర్‌లోకి దూకాడు. ఇదంతా చూస్తున్న పార్క్ సిబ్బంది, పర్యాటకులు షాక్ అయ్యారు. వెనక్కు రావాలని అతణ్ని పిలిచారు. అయితే ఈలోపు ఆ వ్యక్తిని అక్కడున్న పులి గమనించింది. వెంటనే అతడిపై తీవ్రంగా దాడి చేసింది. దీంతో పర్యాటకులు కేకలు వేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు.. రెండు అంబులెన్సులు, ఒక వైద్యుడితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ అప్పటికే ఆ వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వైద్యుడు ఎంత ప్రయత్నించినా ప్రయోజనం లేకపోయింది. పులి దాడిలో అతడు మృతి చెందాడు. ఈ ఘోరమైన ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియా వైరలయ్యాయి. వీటిపై స్పందించిన పోలీసులు కలవరానికి గురిచేసే వీడియోలను మాత్రం షేర్ చేయొద్దని సూచించారు. కాగా మృతుడి వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. అలాగే వైల్డ్‌లైఫ్ పార్క్‌ను మూసివేశారు.
మరోవైపు ఈ ఘటనలో ఆ వ్యక్తిని కాపాడేందుకు భద్రతా సిబ్బంది పులిపై కాల్పులు జరిపారని ఆరోపణలు వచ్చాయి. కొందరు పర్యాటకులు కూడా తాము కాల్పుల శబ్దాలను విన్నామని చెప్పారు. అయితే దీన్ని యార్క్‌షైర్ వైల్డ్‌లైఫ్ పార్క్ యాజమాన్యం కొట్టిపడేసింది. ఘటన అనంతరం పులిని పరీక్షించగా దానిపై ఒక్క గాయం కూడా లేదని వివరించింది. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు తాము సహకరిస్తున్నామని పార్క్ అధికారులు వెల్లడించారు.
ఈ వార్తలూ చదవండి
అడవి నుంచి వింత శబ్దాలు.. వెళ్లి చూస్తే షాక్.. వీడియో
శరన్నవరాత్రుల వేళ బైక్‌లతో అద్భుతం సృష్టించిన బైకర్స్.. వీడియో మీకోసం