శరన్నవరాత్రుల వేళ బైక్‌లతో అద్భుతం సృష్టించిన బైకర్స్.. వీడియో మీకోసం
ABN , Publish Date - Oct 12 , 2026 | 01:12 PM
నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌కు చెందిన కొంతమంది బైకర్లు.. దుర్గామాతపై తమకున్న భక్తిని వినూత్నంగా ప్రదర్శించారు. 71 బైక్‌లతో అమ్మవారి రూపాన్ని ఏర్పాటు చేశారు.
ఇంటర్నెట్ డెస్క్: నిన్న (ఆదివారం) శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. భక్తులు పూజలు, ఉపవాసాలు చేసి అమ్మవారిని ఆరాధిస్తున్నారు. నవరాత్రుల సందర్భంగా గుజరాత్‌కు చెందిన కొంతమంది బైకర్లు.. దుర్గామాతపై తమకున్న భక్తిని వినూత్నంగా ప్రదర్శించారు. 71 బైక్‌లతో అమ్మవారి రూపాన్ని ఏర్పాటు చేశారు. ఆకాశం నుంచి చూస్తే సాక్షాత్తూ దుర్గామాతే దర్శనమిస్తారు. సూరత్ నగరంలోని ఓ బీచ్‌లో కనిపించిందీ దృశ్యం.
దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు ఆ బైకర్లను తెగ మెచ్చుకుంటున్నారు. దుర్గామాతపై ఉన్న భక్తిని, తమ ఫ్రొషెషన్‌పై ఉన్న అభిమానాన్ని వారు ఒకేసారి వ్యక్తం చేశారని అంటున్నారు. పండుగలను సంప్రదాయ పద్ధతులను దాటి కొత్తగా జరపుకోవడం కొందరిని ఆకట్టుకుంది. ప్రీమియం బైక్‌లతో రూపొందించిన అమ్మవారి రూపం చూపరులను మంత్రముగ్ధులను చేస్తోంది.
ఇవీ చదవండి
దేవీ శరన్నవరాత్రులు.. అమ్మవారి ఒక్కో రూపం వెనుక ఉన్న విశిష్టత