నవరాత్రుల సమయంలో ఏం తినాలి? ఏం తినకూడదు?
ABN , Publish Date - Oct 11 , 2026 | 10:05 AM
సాధారణంగా నవరాత్రుల సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తింటారు. ఈ తొమ్మిది రోజుల పాటు ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసుకుందాం రండి.
ఇంటర్నెట్ డెస్క్: ఈరోజు (ఆదివారం) నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమయ్యాయి. ఈ పవిత్రమైన సందర్భంలో భక్తులు ఉపవాసం ఉండి దుర్గాదేవిని పూజిస్తారు. కొందరు మొదటి రోజు, చివరి రోజు ఉపవాసముంటారు. ఇంకొందరు తొమ్మిది రోజులూ కేవలం పండ్లనే తింటారు. ఉపవాసం ఉన్నా లేకున్నా నవరాత్రుల సమయంలో సాత్విక ఆహారం మాత్రమే తినడం ఆనవాయితీ. ఈ తొమ్మిది రోజుల పాటు ఏం తినాలి? ఏం తినకూడదో తెలుసుకుందాం రండి.
ఏం తినాలి..?
నవరాత్రుల సమయంలో సింగాడా పిండి, రాజ్‌గిరా పిండి, సగ్గుబియ్యం వంటివి తినవచ్చు.
కూరగాయల్లో గుమ్మడికాయ, సొరకాయ, దోసకాయ, బంగాళదుంప, చేమదుంప, కంద, క్యారెట్, చిలకడదుంపలను తినొచ్చు.
ఉపవాస సమయంలో టమోటాలు, అల్లం ఉన్న ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు.
మజ్జిగ, లస్సీ లాంటివి తాగొచ్చు
పాల పదార్థాలు ( నెయ్యి, పెరుగు, జున్ను) తినవచ్చు.
నవరాత్రి ఉపవాసాల్లో యాపిల్, అరటి, దానిమ్మ, బొప్పాయి, నారింజ వంటి పండ్లూ తినదగినవే.
డ్రైఫ్రూట్స్‌లో జీడిపప్పు, వాల్‌నట్స్, వేరుశనగ లాంటివి తీసుకోవచ్చు.
అలాగే నల్ల మిరియాల పొడి, జీలకర్ర, పచ్చి మిరపకాయలు, ధనియాలు, యాలకులు వినియోగించవచ్చు.
ఏం తినకూడదు..?
నవరాత్రి సమయంలో బొంబాయి రవ్వ, ఓట్స్, గోధుమలు, బియ్యం, శనగపిండితో పాటు అన్ని రకాల పప్పుధాన్యాలను మానుకోవాలి.
ప్రాసెస్ లేదా ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు తినకూడదు.
ఆహారంలో సాధారణ ఉప్పు, మసాలాలు వాడకూడదు. ఉప్పు స్థానంలో సైంధవ లవణాన్ని (రాతి ఉప్పు) వినియోగించాలి.
అలాగే తామసిక ఆహారాలు తినరాదు.
కుదిరితే తొమ్మిది రోజుల పాటు ఉల్లిపాయ, వెల్లుల్లిని తినకుండా ఉండాలి.
మాంసాహారాలు ఎట్టిపరిస్థితుల్లో తినకూడదు. మద్యం సేవించకూడదు.
గమనిక : ఈ సమాచారమంతా మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. దీనిని మతపరమైన సమాచారంగానే పాఠకులు భావించాలి.
ఇవీ చదవండి
దేవీ శరన్నవరాత్రులు.. అమ్మవారి ఒక్కో రూపం వెనుక ఉన్న విశిష్టత ఇదే
ఇంద్రకీలాద్రిపై బాలా త్రిపురసుందరీ దేవిగా కనకదుర్గమ్మ.. అమ్మవారి అలంకార విశిష్ఠత ఇదే..