నేటి నుంచి బెజవాడలో ఫుడ్ ఫెస్టివల్
ABN , Publish Date - Oct 11 , 2026 | 05:14 AM
దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఆదివారం నుంచి...
తెలుగుదనం ఉట్టిపడే వంటలు.. పల్లెటూరు రుచులకు ప్రాధాన్యం
విజయవాడ, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): దసరా పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అభివృద్ధి సంస్థ(ఏపీటీడీసీ) ఆధ్వర్యంలో ఆదివారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు విజయవాడలో ఆంధ్ర ఫుడ్ ఫెస్టివల్-2026 నిర్వహించనున్నారు. కృష్ణానది తీరంలో.. పక్కనే కనకదుర్గ అమ్మవారి జాతర నడుమ భవానీపురంలోని హరిత బెర్మ్‌పార్క్‌లో ఈ ఆహార పండుగ కొలువుదీరనుంది. తెలుగు నేల ఆహార సంస్కృతిని, ఆంధ్రుల ఆతిథ్య సంప్రదాయాలను ప్రతిబింబించేలా వివిధ ప్రాంతాల ప్రత్యేక వంటకాలను అందుబాటులో ఉంచనున్నారు. శాకాహార బఫే భోజనాన్ని ఒక్కొక్కరికి రూ.250కే అందించనున్నారు.
ఈ వార్తలనూ చదవండి:
ఎవరు అడ్డొచ్చినా నెట్టుకుంటూ పోతాం
దసరాలోపు 2వ విడత తల్లికి వందనం..!