ఎనిమిదేళ్లు ఆగాల్సిందే..
ABN , Publish Date - May 31 , 2026 | 01:39 PM
తక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ గాలులు వీచే ప్రాంతం... తక్కువ ఆక్సిజన్ ఉండే చోట మాత్రమే ఈ మేజికల్ పువ్వు విరబూస్తుంది. అది కూడా ఎనిమిదేండ్లకోసారి మాత్రమే! దాని పేరు ‘స్నో లోటస్’. మంచు తామర అని ముద్దుగా పిలుస్తుంటారు.

ఈ తామర హిమాలయాల్లోని టియాన్‌షాన్ పర్వత ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. అక్కడ కూడా 10 వేల అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో, గడ్డకట్టే ఉష్ణోగ్రతలు ఉంటేనే ఈ మొక్క బతుకుతుంది. మంచు తామర విరబూయాలంటే మాత్రం 5 నుంచి 8 ఏళ్లు పడుతుంది.
విరబూసిన తర్వాత కొంతకాలం మాత్రమే ఉంటుంది. అంతటి కఠినమైన ప్రతికూల వాతావరణంలో పెరుగుతుంది కావునే... పువ్వులో యాంటీఆక్సిడెంట్ గుణాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. ఔషధ గుణాలు ఉండటంతో వీటిని కొన్ని రకాల మందుల తయారీలో ఉపయోగిస్తున్నారట. ‘వాతావరణ మార్పుల వల్ల ఈ మొక్క జాతి ప్రమాదంలో ఉంద’ని వృక్ష శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
నాలుగైదు రోజుల్లో కేరళకు ‘నైరుతి’
Read Latest AP News And Telangana News And International News And Telugu News