డోరా కేక్.. తయారు చేసుకోండిలా..
ABN , Publish Date - May 31 , 2026 | 01:13 PM
డోరా కేక్.. తయారీకి కావలసిన పదార్థాలు: మైదా - కప్పు, చక్కెర పొడి - అర కప్పు, పాల పొడి - పావు కప్పు, బేకింగ్ సోడా - అర కప్పు
కావలసిన పదార్థాలు: మైదా - కప్పు, చక్కెర పొడి - అర కప్పు, పాల పొడి - పావు కప్పు, బేకింగ్ సోడా - అర కప్పు, పాలు - ముప్పావు కప్పు, తేనె - రెండు స్పూన్లు, న్యూటెల్లా - మూడు స్పూన్లు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: ఓ గిన్నెలో మైదా, చక్కెర పొడి, బేకింగ్ సోడా, పాల పొడి వేసి కలపాలి. పాలనూ చేర్చి గిలక్కొట్టాలి. ఇందులోనే తేనె కూడా జతచేయాలి. బాణలికి కాస్త నూనె పూసి చిన్న దోశలా, పిండి వేసి తక్కువ మంట మీద అటూ ఇటూ కాల్చిన తరవాత తీయాలి. ఇలా పిండి మొత్తం దోశల్లా వేసుకోవాలి. కాస్త చల్లగయ్యాక వీటికి న్యూటెల్లా పరచి తింటే సరి.
ఈ వార్తలు కూడా చదవండి:
నాలుగైదు రోజుల్లో కేరళకు ‘నైరుతి’
Read Latest AP News And Telangana News And International News And Telugu News