Share News

సూపర్ స్టార్ కృష్ణ జయంతి.. సీఎం చంద్రబాబు ఘన నివాళి..

ABN , Publish Date - May 31 , 2026 | 10:38 AM

సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను ఎక్స్ వేదికగా చంద్రబాబు కొనియాడారు.

సూపర్ స్టార్ కృష్ణ జయంతి.. సీఎం చంద్రబాబు ఘన నివాళి..
Superstar Krishna Jayanti

అమరావతి: సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమకు కృష్ణ చేసిన సేవలను ఆయన కొనియాడారు. నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా కళామతల్లికి విశిష్ట సేవలందించారని సీఎం ప్రశంసించారు. నూతన సాంకేతికతలను తెలుగు సినిమా పరిశ్రమకు పరిచయం చేసి కొత్త పుంతలు తొక్కించారని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు పోస్టు చేశారు.


సీఎం చంద్రబాబు ఎక్స్ పోస్టు..

'తెలుగు సినీ పరిశ్రమకు నటుడిగా, దర్శకుడిగా, సాహసోపేత నిర్మాతగా విశిష్ట సేవలందించిన పద్మభూషణ్ కృష్ణ గారి జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటున్నాం. నూతన సాంకేతికతలను తెలుగు సినిమాకు పరిచయం చేస్తూ సినీ రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన ఆయన సేవలు చిరస్మరణీయం. అభిమానుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించిన ఆ మహానటుడికి ఘన నివాళులు' అంటూ పోస్టు చేశారు.


మరోవైపు, సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ కృష్ణను స్మరించుకుంటున్నారు. సూపర్ స్టార్ నటించిన సినిమాలను, ఆయన పోషించిన పాత్రలను గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు..

మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. కత్తులతో రైతుపై దాడికి యత్నం..

Updated Date - May 31 , 2026 | 10:48 AM