ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు..
ABN , Publish Date - May 31 , 2026 | 07:14 AM
విశాఖపట్నం గాజువాక సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతిచెందగా.. ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.
విశాఖ: గాజువాకలో ఈ రోజు (ఆదివారం) తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న లారీని ఏపీఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొని ముగ్గురు మృతిచెందగా.. ఏడుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సు రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వైపునకు వెళ్తోంది. అయితే, ఇవాళ ఉదయం 4 గంటల ప్రాంతంలో గాజువాకలోని శ్రీనగర్ వద్దకు రాగానే ప్రమాదవశాత్తూ అదుపుతప్పింది.
ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా ముగ్గురు మృతిచెందారు. బస్సులో సుమారు 30 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానికులు, ఇతర వాహనదారుల సమాచారం మేరకు పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. అనంతరం గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. అలాగే మృతులు, క్షతగ్రాతుల వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
ప్రజలకు మంచి చేస్తే జగన్ ఓర్చుకోలేడు: బ్రహ్మం
జూన్‌లో కొత్తగా 5606 వితంతు పెన్షన్లు