మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. కత్తులతో రైతుపై దాడికి యత్నం..
ABN , Publish Date - May 31 , 2026 | 09:27 AM
ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ మూకల ఆగడాలు ఏమాత్రం తగ్గడం లేదు. కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరులో వారు మరోసారి రెచ్చిపోయారు. ఓ రైతుపై కత్తులతో దాడికి యత్నించారు.
కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ అధికారం కోల్పోయి రెండేళ్లు గడిచినా ఆ పార్టీ నేతల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. టీడీపీ శ్రేణులు సహా సాధారణ ప్రజలపై దాడులకు తెగబడుతూనే ఉన్నారు. సామాన్యులను భయబ్రాంతులకు గురి చేస్తూ రాక్షసానందం పొందుతున్నారు. తాజాగా అలాంటి ఘటనే కర్నూలు జిల్లా కోసిగి మండలం కందుకూరులో చోటు చేసుకుంది. ఆ గ్రామంలో వైసీపీ మూకలు రెచ్చిపోయాయి. రైతుపై కత్తులతో దాడికి యత్నించాయి.
కర్నూలు జిల్లా ఆదోని మండలం పాండవగల్లు గ్రామానికి చెందిన రామదాసు అనే రైతు.. కందుకూరులో పొలం తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. అయితే, తనకు తెలియకుండా గ్రామంలో వ్యవసాయం చేయడంపై వైసీపీ నేత బెట్టన గౌడ్ ఆగ్రహించాడు. తన అనుమతి లేకుండా వ్యవసాయం చేయడం ఏంటని ఊగిపోయాడు. అనుచరులతో కలిసి మారణాయుధాలు తీసుకుని రైతు రామదాసు వద్దకు వెళ్లాడు. రైతును చూసిన వెంటనే ఒక్కసారిగా కత్తులతో దాడికి యత్నించారు. వైసీపీ మూకల దాడి నుంచి అతి కష్టం మీద తప్పించుకున్నాడా రైతు. అనంతరం పోలీసులను ఆశ్రయించాడు. వైసీపీ నేత బెట్టన గౌడ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని.. రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ ఘటనతో కందుకూరు, పాండవగల్లు గ్రామాల ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వ్యవసాయం చేయాలంటే వైసీపీ నేతల అనుమతి తీసుకోవాలా? అంటూ మండిపడుతున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
ఉత్తర్ ప్రదేశ్ ఘజియాబాద్‌లో ఎన్‌కౌంటర్.. హత్య కేసు నిందితుడి హతం..
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి, ఏడుగురికి తీవ్రగాయాలు..