టమాటా బజ్జీ.. ఇలా చేస్తే ఆ టేస్టే వేరు..
ABN , Publish Date - May 31 , 2026 | 12:47 PM
టమాటా బజ్జీ తయారీకి కావలసిన పదార్థాలు: టమాటాలు - ఆరు, శనగ పిండి - ఒకటిన్నర కప్పు, వరి పిండి - పావు కప్పు, పసుపు - మూడు స్పూన్లు, కారం - అర స్పూను,
కావలసిన పదార్థాలు: టమాటాలు - ఆరు, శనగ పిండి - ఒకటిన్నర కప్పు, వరి పిండి - పావు కప్పు, పసుపు - మూడు స్పూన్లు, కారం - అర స్పూను, బేకింగ్ సోడా - పావు స్పూను, కొత్తిమీర తరుగు - స్పూను, ఉల్లి ముక్కలు - కప్పు, అల్లం పేస్టు - అర స్పూను, ధనియాల పొడి - అర స్పూను, జీలకర్ర పొడి - అర స్పూను, ఉడికించిన ఆలూ తురుము - కప్పు, ఆమ్ చూర్ - స్పూను, నూనె, నీళ్లు, ఉప్పు - తగినంత.
తయారుచేసే విధానం: ఓ బాణలిలో నూనె వేసి ఉల్లి ముక్కలు వేయించాలి. మిర్చి, అల్లం పేస్టు కూడా కలపాలి. ఉల్లి రంగు మారగానే పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, ఉప్పు జతచేయాలి. తక్కువ మంట మీద కాసేపు వేయించాలి. ఆ తరవాత ఆలూ కలపి మొత్తం కలిసేలా చూడాలి. ఆమ్‌చూర్, కొత్తిమీర చేర్చి, పొయ్యి మీద నుంచి దించాలి. ఇదే ఆలూ స్టఫింగ్‌లా ఉపయోగపడుతుంది. ఓ గిన్నెలో శనగపిండి, వరి పిండి, పావు స్పూను పసుపు, కొద్దిగా కారం, బేకింగ్ సోడా, ఉప్పు, కాస్త నీటిని చేర్చి బజ్జీపిండిలా చేసుకోవాలి. ఇప్పుడు టమాటాని రెండుగా కట్‌చేసి అందులోంచి గింజలను తొలిగించాలి. ఆలూ మిశ్రమాన్ని ఈ టమాటాలో పెట్టి, శనగపిండి జారులో కలిపి ఒక్కోటీ నూనెలో వేయిస్తే టమాటా బజ్జీ రెడీ.
ఈ వార్తలు కూడా చదవండి:
నాలుగైదు రోజుల్లో కేరళకు ‘నైరుతి’
Read Latest AP News And Telangana News And International News And Telugu News