ఆపరేషన్ సిందూర్ ఎఫెక్ట్.. అమెరికా సంస్థతో పాకిస్థాన్ ఒప్పందం..
ABN , Publish Date - May 31 , 2026 | 11:44 AM
అమెరికాకు చెందిన కమర్షియల్ లాబీయింగ్, పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ‘ఎర్విన్ గ్రేవ్స్ స్ట్రాటజీ గ్రూప్ ఎల్ఎల్‌సీ’తో పాకిస్థాన్ కీలక ఒప్పందం చేసుకుందని యూఎస్ ఫారెన్ ఎజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (ఫారా) తెలిపింది.
న్యూయార్క్, మే 31: అమెరికాకు చెందిన కమర్షియల్ లాబీయింగ్, పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ‘ఎర్విన్ గ్రేవ్స్ స్ట్రాటజీ గ్రూప్ ఎల్ఎల్‌సీ’తో పాకిస్థాన్ కీలక ఒప్పందం చేసుకుందని యూఎస్ ఫారెన్ ఎజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్ (ఫారా) తెలిపింది. పాకిస్థాన్ ప్రభుత్వం, ఎర్విన్ గ్రేవ్స్ సంస్థ మధ్య మే 1వ తేదీన 1.2 మిలియన్ డాలర్స్ ఒప్పందం జరిగిందని వెల్లడించింది. పాకిస్థాన్ నెలకు 50 వేల డాలర్ల చొప్పున 24 నెలల పాటు 1.2 మిలియన్ డాలర్లు సంస్థకు చెల్లించనుందని పేర్కొంది. సంస్థ సేవలు మొదలుకావడానికి మూడు నెలల ముందే పాకిస్థాన్ 1,50,000 డాలర్లను సదరు సంస్థకు చెల్లించిందని తెలిపింది.
ఒప్పందం ఎందుకోసమంటే..
ఆపరేషన్ సిందూర్ తర్వాత అమెరికా, పాకిస్థాన్‌ల మధ్య దౌత్య సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరచటం కోసం వాషింగ్టన్‌కు కమర్షియల్ లాబీయింగ్, పబ్లిక్ రిలేషన్స్ సంస్థ ‘ఎర్విన్ గ్రేవ్స్ స్ట్రాటజీ గ్రూప్ ఎల్ఎల్‌సీ’తో పాకిస్థాన్ ఈ ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ అమెరికా దృష్టిలో పాకిస్థాన్ ఇమేజ్‌ను పెంచే విధంగా పలు కార్యక్రమాలు చేపడుతుంది.
రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరుస్తుంది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చే సరిహద్దు ఉగ్రవాద ముప్పును పాకిస్థాన్ ఒంటరిగా ఎదుర్కొంటోందని, ప్రాంతీయ స్థిరత్వానికి పాకిస్థాన్ కీలకమని ఆ సంస్థ అమెరికాకు వివరించనుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో అమెరికాకు పాకిస్థాన్ సరైన భాగస్వామి అని ప్రొజెక్ట్ చేయనుంది.
ఇవి కూడా చదవండి
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఇవి తీసుకుంటున్నారా? జాగ్రత్త!