ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
ABN , Publish Date - May 31 , 2026 | 11:27 AM
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 'ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్' అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పథకాన్ని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు.
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు 'ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్' అమలుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పథకాన్ని ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా అమలు చేయాలని సీఎం రేవంత్ నిర్ణయించారు. ట్రస్ట్‌లో ఉద్యోగ సంఘాల నుంచి ఆరుగురు ప్రతినిధులకు, పెన్షనర్ల నుంచి ఇద్దరు సభ్యులకు అవకాశం కల్పించాలని నిశ్చయించారు. ప్రభుత్వ ఉద్యోగినే ట్రస్ట్ సీఈవోగా నియమించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సోమవారం ట్రస్ట్ కమిటీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరోవైపు ఉద్యోగులు, పెన్షనర్లకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కింద సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యుల వివరాల సేకరణ ప్రారంభమైంది. మే 31లోగా డేటా అప్‌లోడ్ చేయాలని గతంలోనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. నేటితో ఆ గడువు ముగియనుంది. డేటా అప్‌లోడ్ తర్వాత హెల్త్ కారులు మంజూరు అయ్యే అవకాశం ఉంది. కాగా, ఈ పథకం ద్వారా నగదు రహిత వైద్య సేవలను ప్రభుత్వం అందించనుంది. దీని ద్వారా ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పించనుంది.
ఈ వార్తలు కూడా చదవండి
ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలం
ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి