ఓటర్ల జాబితా సవరణపై అప్రమత్తంగా ఉండాలి
ABN , Publish Date - May 31 , 2026 | 06:15 AM
దేశవ్యాప్తంగా సెక్యులర్ ఓటర్లను తొలగిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు.
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, మే 30 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా సెక్యులర్ ఓటర్లను తొలగిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ పిలుపునిచ్చారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో అక్రమాలు జరగకుండా బూత్‌స్థాయి నుంచి కాంగ్రెస్ శ్రేణులు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టం చేశారు. శనివారం గాంధీ భవన్‌లో ఏఐసీసీ తెలంగాణ ఇంచార్జి మీనాక్షి నటరాజన్‌తో కలిసి మహేశ్‌కుమార్ గౌడ్ బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్‌ఏ), సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్లతో (ఎస్‌ఎస్‌ఏ) సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఓటర్ల జాబితా సవరణపై కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక నిఘా ఉంచుతుందని, ఇందులో భాగంగా ప్రతివారం మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో పర్యటిస్తారని మహేశ్‌కుమార్ గౌడ్ వెల్లడించారు.