Share News

చేతితో తాకకుండా...

ABN , Publish Date - Aug 09 , 2026 | 01:22 PM

ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే హఠాత్తుగా వర్షం మొదలైంది. రోడ్డు పక్కన ఆగి, రెయిన్‌ కోట్‌ వేసుకునే లోపు తడిసిపోతాం.

చేతితో తాకకుండా...
self wearing robotic dress

ద్విచక్ర వాహనంపై వెళ్తుంటే హఠాత్తుగా వర్షం మొదలైంది. రోడ్డు పక్కన ఆగి, రెయిన్‌ కోట్‌ వేసుకునే లోపు తడిసిపోతాం. సరిగ్గా ఆ సమయంలో రెయిన్‌కోట్‌ను చేతితో తాకకుండా... దానంతట అదే శరీరాన్ని కప్పేస్తే ఎలా ఉంటుంది? ఇదేదో సైన్స్‌ఫిక్షన్‌లా ఉంది కదూ. అందుకే శాస్త్రవేత్తలు ఆలోచించి తాకకుండానే పది సెకన్లలో శరీరాన్ని కప్పేసే దుస్తుల్ని తయారుచేశారు.

దక్షిణ కొరియా, అమెరికా పరిశోధకుల బృందం ఒక సరికొత్త రోబోటిక్‌ సాంకేతికతను ఆవిష్కరించింది. అదేమిటంటే... ఒక వ్యక్తి తన చేతులతో తాకకుండా, ఇతరుల సహాయాన్ని తీసుకోకుండా డ్రెస్‌ ధరించడం. కైస్ట్‌, స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. అలాంటి దుస్తులలో గాలి పీడనంతో పనిచేసే మృదువైన, సులభంగా వంగే తీగలను పొందుపరిచారు.


అవి పీడనం కలిగినప్పుడు... వ్యక్తి నిశ్చలంగా నిలబడకపోయినా కూడా అందులోని తీగలు పైకి పాకుతాయి అచ్చంగా ఐవీ మొక్కలా. దుస్తుల్లోని తీగలు శరీరానికి దగ్గరగా జరగడం వల్ల వాటిని ముట్టుకోవాల్సిన పనిలేదు. ఈ దుస్తులను ప్రత్యేకంగా వృద్ధులు, దివ్యాంగులు, కార్మికుల కోసం తయారు చేశారట. ఈ తరహా రోబోటిక్‌ డ్రెస్‌వల్ల వారికి సమయం ఆదా అవు తుందని పరిశోధకులు చెబుతున్నారు. తమ పనులు తాము చేసుకోలేని అసహాయులకు, కార్మికులకు ఈ డ్రెస్‌ ఉపయోగకరమే అనిపిస్తోంది కదూ!


ఈ వార్తలు కూడా చదవండి:

మంచుకొండల నుంచి... సరిహద్దు గ్రామాల్లోకి...

వంటలు: పెసర పప్పు కట్‌లెట్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 09 , 2026 | 01:22 PM