నిశ్శబ్దం ఓ ఆయుధం
ABN , Publish Date - Aug 09 , 2026 | 12:54 PM
నిశ్శబ్దం... ప్రశాంతమైనదేనా... శక్తిమంతమైనది కూడా. ప్రతీ ఒక్కరికి నిశ్శబ్దం ఒక రీసెట్ టూల్‌గా పనిచేస్తుంది.
నిశ్శబ్దం... ప్రశాంతమైనదేనా... శక్తిమంతమైనది కూడా. ప్రతీ ఒక్కరికి నిశ్శబ్దం ఒక రీసెట్ టూల్‌గా పనిచేస్తుంది. మానసిక స్పష్టతను అందిస్తుంది. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంచుతుంది. గజిబిజీ జీవితంలో ఈ ఆయుధం దగ్గరుంటే కలిగే ప్రయోజనాలివి...
నిశ్శబ్దం ప్రపంచంలో అరుదైన సంపద. అది ఏకాగ్రతను, మానసిక స్పష్టతను అందిస్తుంది. రోజూ రెండు గంటల పాటు నిశ్శబ్దంగా ఉంటే.. మెదడులోని ‘హిప్పోకాంపస్’ భాగంలో కణాల వృద్ధి మెరుగ్గా జరుగు తుందని డ్యూక్ యూనివర్సిటీ అధ్యయనంలో తేలింది.
నిశ్శబ్దంతో మెదడుకు విశ్రాంతి లభిస్తుంది. ఫలితంగా ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త ఉత్సాహం లభిస్తుంది. సులభంగా నిద్రలోకి జారుకుంటారు. ఆ అలవాటు నాడీవ్యవస్థను శాంతపరిచి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇదొక మెంటల్ రీసెట్ టూల్‌గా పనిచేస్తుంది. ఉదయం నిద్ర లేచిన తరువాత పది నిమిషాల పాటు నిశ్శబ్ద వాతా వరణంలో నడక, ధ్యానం చేయడం వల్ల శరీరానికి అవసర మైన శక్తి లభిస్తుంది. మనసు ఉల్లా సంగా మారుతుంది.
సైలెన్స్ క్రియేటివిటీని పెంచు తుంది. సమస్యను వేగంగా పరిష్కరించే సామర్థ్యాన్ని ఇస్తుంది. ప్రశాంత వాతావరణంలో మెదడు ‘డీఫాల్ట్ మోడ్ నెట్‌వర్క్’ యాక్టివిటీలోకి వెళుతుంది. దీనివల్ల పాత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి. ఊహాశక్తి పెరుగు తుంది.
కొత్త ఆలోచనలు రావడానికి, సమస్య పరిష్కారానికి ఈ మోడ్ చాలా అవసరం.
నిశ్శబ్ద వాతావరణానికి, నేర్చుకోవడానికి సంబంధం ఉంది. ఎక్కువ శబ్దాలు ఉన్న చోట ఏకాగ్రత కోల్పోతారు. నేర్చుకోవడంలో ఇబ్బందిపడతారని యూపీఎంసీ హెల్త్ రిపోర్టులో పేర్కొంది. నిశ్శబ్ద వాతావరణంలో ఏదైనా సరే వేగంగా గ్రహిస్తారు.

మానసిక ఒత్తిడితో అలసిపోయినప్పుడు నిశ్శబ్దం సహజ మందులా పనిచేస్తుంది. భావోద్వేగాలు సమతుల్యమవుతాయి. ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి.
మనసును సర్దుబాటు చేసుకునేందుకు నిశ్శబ్దం అద్భుతమైన సాధనం. ఇది మనలోని మనతో అనుసంధానం కావడానికి సాయపడుతుంది. నిశ్శబ్దం మానసిక శక్తిని పునరుద్ధరిస్తుందని సైకాలజీ స్టడీలో తేలింది.
నిశ్శబ్దం ఒత్తిడిని తగ్గిస్తుంది. రోజూ కాసేపు నిశ్శబ్దంగా ఉండటం వల్ల స్ట్రెస్ లెవెల్స్ గణనీ యంగా తగ్గుతున్నట్టు అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్స్ ‘స్ట్రెస్ ఇన్ అమెరికా’ పేరుతో విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది.
నిశ్శబ్ద వాతావరణంలో ధ్యానం చేయడం, ప్రశాంతంగా కూర్చోవడం వంటి అలవాట్లు డోపమైన్ స్థాయిలను పెంచడంలో సహాయపడతాయి. నిశ్శబ్దంగా
కాసేపు ధ్యానం చేసేవారు మానసిక స్పష్టత కలిగి ఉంటారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
నిశ్శబ్దం ఓపికను పెంచు తుంది. లంచ్ బ్రేక్ సమయంలో పది నిమిషాలు నిశ్శబ్దంగా ఉంటే కనుక మైండ్ రీసెట్ అవుతుంది. ఓపిక రెట్టింపవు తుంది.
రెండు నిమిషాల నిశ్శబ్దం పారాసింపథిక్ నర్వస్ సిస్టమ్‌ను యాక్టివేట్ చేస్తుంది. ఫలితంగా హార్ట్‌రేట్ నెమ్మదిస్తుంది. కార్టిసాల్ లెవెల్స్ తగ్గుతాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
మంచుకొండల నుంచి... సరిహద్దు గ్రామాల్లోకి...
Read Latest AP News And Telangana News And International News And Telugu News