వంటలు: పెసర పప్పు కట్‌లెట్
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:58 AM
పెసర పప్పు కట్‌లెట్ తయారీకి కావలసిన పదార్థాలు: పెసర పప్పు గుండ్లు - కప్పు, అటుకులు - కప్పు, ఉల్లిముక్కలు-అర కప్పు
కావలసిన పదార్థాలు: పెసర పప్పు గుండ్లు - కప్పు, అటుకులు - కప్పు, ఉల్లిముక్కలు-అర కప్పు, పచ్చి మిర్చి ముక్కలు - స్పూను, అల్లం- అర స్పూను, కొత్తిమీర తరుగు - అర కప్పు, శనగ పిండి - రెండు స్పూన్లు, జీలకర్ర, ధనియాల పొడి- చెరో స్పూను, కారం - స్పూను, ఉప్పు, నీళ్లు, నూనె - తగినంత.
తయారుచేసే విధానం: పెసర పప్పును అయిదు గంటలు నీళ్లలో నానబెట్టాలి. ఆ తరవాత నీళ్లు వడగట్టి చిక్కని పేస్టులా తయారుచేసుకోవాలి. అటుకుల్ని కడిగి పెట్టు కోవాలి. ఓ బాణలిలో శనగ పిండిని వేయించుకోవాలి. ఓ పెద్ద గిన్నెలో పెసర పేస్టు, అటుకులు, శనగపిండి, ఉల్లి, పచ్చి మిర్చి, అల్లం, కొత్తిమీర....బాగా కలపాలి. మిగిలిన పొడులు, ఉప్పు చేర్చాలి. ఈ మిశ్రమాన్ని చిన్న ముద్దలుగా చేసుకుని చేత్తో వత్తుకుని నూనెలో వేయిస్తే కట్‌లెట్ రెడీ.
ఈ వార్తలు కూడా చదవండి:
మంచుకొండల నుంచి... సరిహద్దు గ్రామాల్లోకి...
మొజ్తాబా బతికే ఉన్నారు.. వీడియో రిలీజ్ చేసిన ఇరాన్..
Read Latest AP News And Telangana News And International News And Telugu News