ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా మెడలు వంచక తప్పదు: టీపీసీసీ చీఫ్
ABN , Publish Date - Aug 09 , 2026 | 11:23 AM
క్విట్ ఇండియా గొప్పతనాన్ని యువతరం తెలుసుకోవాల్సి ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా కీలక ఘట్టమని అభివర్ణించారు.
హైదరాబాద్, ఆగస్టు 09: క్విట్ ఇండియా గొప్పతనాన్ని యువతరం తెలుసుకోవాల్సి ఉందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో క్విట్ ఇండియా కీలక ఘట్టమని అభివర్ణించారు. ఆదివారం నాంపల్లిలోని గాంధీ భవన్‌లో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఆగస్టు 8వ తేదీన మహత్మా గాంధీ ఇచ్చిన పిలుపుతో యావత్ భారతదేశం కదం తొక్కిందని గుర్తు చేశారు.
మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూతోపాటు సుభాష్ చంద్రబోస్.. ఈ క్విట్ ఇండియా ఉద్యమానికి స్ఫూర్తి అని తెలంగాణ పీసీసీ చీఫ్ గుర్తు చేశారు. బ్రిటిష్ వాళ్లు భారత్ విడిచి వెళ్ళిపోవడానికి ఈ ఉద్యమమే ప్రధాన కారణమని వివరించారు. కేంద్రం మొండి వైఖరికి వ్యతిరేకంగా జెన్ జీ ఉద్యమం చేపట్టిందని తెలిపారు. క్విట్ ఇండియా ఉద్యమం గురించి తెలుసుకోవాలని జెన్ జీ ఉద్యమ వీరులకు ఈ సందర్భంగా ఆయన సూచించారు. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వేలాది మంది సర్వం కోల్పోయి ప్రాణత్యాగాలు చేస్తేనే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని గుర్తు చేశారు.
అయితే ప్రస్తుతం దేశంలో మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని నెహ్రూను మరిపించే ప్రయత్నం జరుగుతుందని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. సర్దార్ పటేల్‌ను బీజేపీ సొంతం చేసుకునే ప్రయత్నం చేస్తుందని అసహనం వ్యక్తం చేశారు. రాజ్యాంగానికి తూట్లు పొడిచే వారికి క్విట్ చెప్పాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎంతటి వారైనా మెడలు వంచక తప్పదని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం రావటానికి గల కారణాలను యువత అధ్యయనం చేయాలని అభిప్రాయపడ్డారు.
దేశం ఆశ్చర్యం పోయేలా తెలంగాణలో అభివృది, సంక్షేమం జరుగుతున్నాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల అధికారంలో ఉందని.. ఆ సమయంలో రాష్ట్రాన్ని ఏం ఉద్ధరించలేదని విమర్శించారు. ఉద్యోగాల విషయంలో బీఆర్ఎస్ నేతల చేస్తున్న ప్రగల్భాలు హాస్యాస్పదమని అన్నారు. సద్విమర్శ చేయండి.. అంతే కానీ అసత్యాలు మాట్లాడకండంటూ ప్రతిపక్షాలను తీవ్ర స్వరంతో హెచ్చరించారు.
అభివృధి, సంక్షేమం.. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మరోసారి అధికారంలోకి తీసుకొస్తుందని ఆయన జోస్యం చెప్పారు. కార్యకర్తల కష్టాన్ని మరిచిపోమని పార్టీ శ్రేణులకు ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. సర్ ప్రక్రియలో ఓట్లు తొలగించే కార్యక్రమం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓట్ల తొలగింపును అడ్డుకొని అర్హత కలిగిన ఓటును కాపాడుతున్నామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కుల వివక్ష లేకుండా పోరాటం చేస్తున్నామని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
సోపోర్‌లోని 27 ప్రాంతాల్లో భద్రతా దళాలు ఆకస్మిక తనిఖీలు
ప్రధాని మోదీని సంప్రదించిన తర్వాతే.. రాజీనామా చేశా: ధర్మేంద్ర ప్రధాన్
For More TG News And Telugu News