జమ్మూ కశ్మీర్‌లోని సోపోర్‌లో భద్రతా దళాలు ఆకస్మిక తనిఖీలు
ABN , Publish Date - Aug 09 , 2026 | 10:42 AM
ఉగ్రవాద లింకులు ఉన్నాయనే అనుమానంతో జమ్మూ కశ్మీర్ బారాముల్లా జిల్లాలోని పలు ప్రాంతాల్లో భద్రతా దళాలు, దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి.
శ్రీనగర్, ఆగస్టు 09: ఉగ్రవాద లింకులు ఉన్నాయనే అనుమానంతో జమ్మూ కశ్మీర్ బారాముల్లా జిల్లాలో సోపోర్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో భద్రతా దళాలు, దర్యాప్తు సంస్థలు సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. సోపోర్‌లోని 27 ప్రదేశాల్లో ఏక కాలంలో ఈ దాడులు చేపట్టాయి. ఆదివారం తెల్లావారుజాము నుంచే ఈ ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. జమాత్ ఎ ఇస్లామీ (Jei) సంస్థపై చట్టవిరుద్ధమైన కార్యకలాపాల నిరోధక చట్టం కింద కేసు నమోదయిన సంగతి తెలిసిందే.
నిషేధం విధించిన ఈ సంస్థకు సంబంధించిన రహస్య నెట్‌వర్క్‌ను వెలికితీయడమే లక్ష్యంగా ఈ దాడులు చేపట్టాయి. ఈ ఏడాది ఆరంభంలోనే కాకుండా మే 25వ తేదీన జైష్ ఇ ఇస్లామ్ సంస్థకు నిధులు వెళ్తున్నట్లు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గుర్తించింది. ఈ నేపథ్యంలో కాశ్మీర్ వ్యాలీలోని వివిధ ప్రాంతాల్లో వరుసగా ముమ్మర తనిఖీలు చేపట్టింది. అదే సమయంలో పలు విద్య సంస్థలతోపాటు నిషేధిత సంస్థ మాజీ అధిపతి నివాసంలో కూడా సోదాలు చేపట్టింది.
అలాగే శ్రీనగర్, షోపియాన్ జిల్లాలోని మూడు ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో Jeiతోపాటు దాని అనుబంధ సంస్థలతో కార్యకలాపాలు సాగిస్తున్నట్లుగా భావిస్తున్న సంస్థల్లోని ఎలక్ట్రానిక్ పరికరాలతోపాటు ఆర్థిక పత్రాలను దర్యాప్తు సంస్థలు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రధాని మోదీని సంప్రదించిన తర్వాతే.. రాజీనామా చేశా: ధర్మేంద్ర ప్రధాన్
ఇండక్షన్ స్టవ్‌లకు వడ్డీ లేని రుణాలు!
For More National News And Telugu News