Share News

వంటలు: కార్న్‌ పాలక్‌ కిచిడీ

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:26 PM

కార్న్‌ పాలక్‌ కిచిడీ తయారీకి కావలసిన పదార్థాలు: పాలకూర తరుగు - నాలుగు కప్పులు, బాస్మతి బియ్యం - కప్పు, పెసర పప్పు గుండ్లు - స్పూను.

వంటలు: కార్న్‌ పాలక్‌ కిచిడీ
Vantalu

కావలసిన పదార్థాలు: పాలకూర తరుగు - నాలుగు కప్పులు, బాస్మతి బియ్యం - కప్పు, పెసర పప్పు గుండ్లు - స్పూను, స్వీట్‌ కార్న్‌ - రెండు కప్పులు, పసుపు - అర స్పూను, అల్లంవెలుల్లి పేస్టు - రెండున్నర స్పూన్లు, ఉల్లి ముక్కలు - కప్పు, టమాటా ముక్కలు - అర కప్పు, కారం - అర స్పూను, గరం మసాలా - స్పూను, ధనియాల పొడి - అర స్పూను, దాల్చిన చెక్క - చిన్న ముక్క, లవంగం - ఒకటి, యాలకులు - రెండు, కొత్తిమీర, కరివేపాకు - స్పూను, పచ్చి మిర్చి ముక్కలు - రెండు స్పూన్లు, జీలకర్ర పొడి - రెండు స్పూన్లు, ఉప్పు, నీళ్లు, నెయ్యి - తగినంత.


book10.2.jpgతయారుచేసే విధానం: ఓ గిన్నెలో బియ్యాన్ని అరగంట పాటు నానబెట్టాలి. ప్రెషర్‌ కుక్కర్‌లో వడగట్టిన బియ్యం, పెసర పప్పు, పసుపు, ఉప్పు, స్వీట్‌కార్న్‌, రెండు కప్పుల నీళ్లు వేసి అన్నీ కలిపి మూతపెట్టాలి. మూడు విజిల్స్‌ తరవాత దించేయాలి. కాస్త నీళ్లు పోసి, పాలకూర స్మూతీ చేసుకోవాలి. ఓ ప్యాన్‌లో కొద్దిగా నెయ్యి వేసి అల్లంవెల్లుల్లి పేస్టు వేయాలి. ఘుమఘుమలాడుతుంటే ఉల్లి, టమాటా ముక్కలు చేర్చాలి. ఉల్లి రంగు మారాక, పాలకూర ప్యూరీ, కారం, గరం మసాలా, ధనియాల పొడి వేసి కలపాలి. ఆ తరవాత ఉడికిన పప్పుబియ్యం, కొంచెం నీళ్లు చేర్చి రెండు నిమిషాలు ఉడికించాలి. మరో చిన్న ప్యాన్‌లో కాస్త నెయ్యి వేసి లవంగాలు, జీలకర్ర, యాలకులు, దాల్చిన చెక్క, కొత్తిమీర, పచ్చి మిరపతో పోపు పెట్టి కార్న్‌ పాలక్‌ కిచిడీలో కలిపితే సరి.


ఈ వార్తలు కూడా చదవండి:

మంచుకొండల నుంచి... సరిహద్దు గ్రామాల్లోకి...

వంటలు: పెసర పప్పు కట్‌లెట్‌

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 09 , 2026 | 12:26 PM