గుంతల రోడ్డుపై బాలికల వినూత్న నిరసన.. స్పందించిన ఎమ్మెల్యే
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:41 AM
మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో కొంతమంది పాఠశాల విద్యార్థినులు తమ పాఠశాలకు వెళ్లే గుంతలమయమైన రహదారిపై వినూత్నమైన వీడియో తీశారు. అది కాస్త వైరల్ కావడంతో వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించి రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు.
ఇంటర్రెట్ డెస్క్: మహారాష్ట్రలోని రాయ్‌గడ్ జిల్లాలో కొంతమంది పాఠశాల విద్యార్థినులు తమ పాఠశాలకు వెళ్లే గుంతలమయమైన రహదారిపై వినూత్నమైన వీడియో తీశారు. అది కాస్త వైరల్ కావడంతో వెంటనే స్థానిక ఎమ్మెల్యే స్పందించి.. రోడ్డుకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు. రాయ్‌గడ్ జిల్లా కర్జత్‌లో గుంతలతో అధ్వానంగా మారిన ఖండపే-కొండివాడే రహదారిపై ముగ్గురు పాఠశాల విద్యార్థినులు వినూత్నంగా వీడియో తీశారు. తమ సమస్యను ప్రజల దృష్టికి తీసుకెళ్లేందుకు ఒకరు రిపోర్టర్‌గా, మరొకరు కెమెరామెన్‌గా, ఇంకొకరు ఇంటర్వ్యూ ఇచ్చే వ్యక్తిగా నటిస్తూ వీడియో రూపొందించారు. ‘రోడ్డుపై గుంతలు ఉన్నాయా.. లేక గుంతల్లో రోడ్డు ఉందా?’ అంటూ వారు చేసిన సరదా వ్యాఖ్యలు, గొడుగును మైక్‌లా ఉపయోగిస్తూ చేసిన రిపోర్టింగ్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వీడియోలో రిపోర్టర్ నేహా ఘరే, కెమెరామెన్ మాన్సీ పవార్ అంటూ తమను పరిచయం చేసుకోవడం కూడా ఆకట్టుకుంది.
వీడియో వైరల్ కావడంతో స్థానిక శాసనసభ్యుడు మహేంద్ర థోర్వే స్పందించారు. రహదారిపై ఉన్న గుంతలను తాత్కాలికంగా పూడ్చి, మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల కారణంగా రహదారిలోని కొంతభాగం దెబ్బతిన్నదని ఆయన తెలిపారు. వర్షాకాలం ముగిసిన అనంతరం రహదారిని పూర్తిస్థాయిలో మరమ్మతులు చేసి, కొత్తదానిలా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బాలికలు రూపొందించిన చిన్న వీడియోతో సమస్య అధికారుల దృష్టికి వెళ్లడం, వెంటనే మరమ్మతు పనులు ప్రారంభం కావడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి
ఈసారి కూడా అసెంబ్లీకి వైసీపీ డుమ్మా..
రక్షిత అడవులు.. ఏనుగులకు సురక్షిత ఆవాసాలే లక్ష్యం: డిప్యూటీ సీఎం పవన్