Share News

మీరు ఎన్నుకున్న ప్రభుత్వమేగా.. పోలీసు అధికారి వీడియో వైరల్

ABN , Publish Date - Aug 12 , 2026 | 10:28 AM

ఇటీవల ఝార్ఖండ్ విద్యార్థుల నిరసన సందర్భంగా ఓ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయన వ్యాఖ్యలతో కొందరు ఏకీభవిస్తుంటే మరికొందరు మాత్రం ఆ వాదనలోని మౌలికమైన తప్పును ఎత్తి చూపుతున్నారు.

మీరు ఎన్నుకున్న ప్రభుత్వమేగా.. పోలీసు అధికారి వీడియో వైరల్
Police Officers Comments on Jharkhand Protests

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల ఝార్ఖండ్ విద్యార్థుల నిరసన సందర్భంగా ఓ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. ఆయన వ్యాఖ్యలతో కొందరు ఏకీభవిస్తుంటే మరికొందరు మాత్రం ఆ వాదనలోని మౌలికమైన తప్పును ఎత్తి చూపుతున్నారు. రకరకాల కామెంట్స్ మధ్య ఈ వీడియో ప్రస్తుతం ట్రెండింగ్‌లో కొనసాగుతోంది.

రాంచీలో ఈ ఘటన వెలుగు చూసింది. వీడియోలో కనిపించిన దాని ప్రకారం, నిరసన సమయంలో యువత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లాఠీ చార్జ్‌పై అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలో ఓ పోలీసు విద్యార్థులతో మాట్లాడుతూ తప్పు యువతదే అన్నట్టు కామెంట్ చేశారు. ‘మీరేగా వీరికి ఓట్లు వేసి ఎన్నుకున్నది..’ అంటూ కౌంటర్ ఇచ్చారు.


ఈ వీడియో వైరల్‌ కావడంతో జనాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వచ్చింది. పోలీసు అధికారి వాదనలో మౌలికమైన తప్పు ఉందని అనేక మంది చెప్పారు. అధికారంలోకి రావడం, లాఠీ చార్జ్‌కు ఆదేశించడం రెండు వేర్వేరు అంశాలని అన్నారు. ‘సార్.. ప్రభుత్వాలు తప్పు చేసినప్పుడు నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది. తమను ప్రజలు ఎన్నుకున్నారన్న కారణంగా వారిపై లాఠీ చార్జ్ చేసే హక్కు ప్రభుత్వాలకు ఉండదు’ అని ఓ వ్యక్తి అన్నారు. ‘తప్పు పూర్తిగా పోలీసులదని అనలేం. వారు తమ డ్యూటీ చేస్తున్నారు. కానీ తప్పంతా ఓటేసిన ప్రజలదే అనడం సబబు కాదు’ అని మరో వ్యక్తి అభిప్రాయపడ్డారు.


ఈ వార్తలనూ చదవండి:

ఇరాన్ ముప్పు నుంచి తప్పించుకునేందుకు అలా చేశా: డొనాల్డ్ ట్రంప్

అదానీకి భారీ ఊరట

Updated Date - Aug 12 , 2026 | 10:50 AM