పాపను కాపాడిన సూపర్ హీరో.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 08 , 2026 | 06:44 PM
సినిమాల్లో సూపర్ హీరోలు చేసే స్టంట్లు చాలామందికి సుపరిచితమే. అయితే ఓ పాపను కాపాడడానికి ఓ రియల్ హీరో చేసిన స్టంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: మెక్సికోకు చెందిన ఓ సాదాసీదా వ్యక్తి ధైర్యసాహసాలు కనబరిచి హీరోగా మారాడు. ఓ చిన్నారిని ప్రాణాలకు తెగించి ప్రమాదం నుంచి కాపాడాడు. అయితే ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారాడంతో అతడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఆ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి పని చేసుకుంటూ కనిపిస్తాడు. అప్పుడే ఓ చిన్నారి పరుగులు పెడుతూ వస్తుంది. ఆ చిన్నారిని పట్టుకోవడానికి తల్లీ కూడా వెనకాలే వస్తోంది. అయితే తల్లికి దొరకకుండా ఉండేందుకు ఆ పాప.. ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చేస్తుంది. ఆమెను ఆపే ప్రయత్నంలో తల్లి రోడ్డుపైనే పడిపోతుంది. అది చూసిన ఆ వ్యక్తి వెంటనే చిన్నారి కోసం ఒక్క ఉదుటు పరుగెట్టి ఆమెను పట్టుకుంటాడు. ఇంతలో ఓ కారు.. వీరిని ఢీకొనబోతుంటే పాపతో పాటు పక్కకు జంప్ అవుతాడు. క్షణాల్లో ప్రమాదం తప్పడంతో అక్కడున్నవారంతా ఊపిరిపీల్చుకుంటారు. అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైన వీడియోను చూసిన నెటిజన్లు ఆ వ్యక్తిని తెగ మెచ్చుకుంటున్నారు. అతడిని సూపర్ హీరోతో పోల్చుతున్నారు.
ఇవి కూడా చదవండి
213 అడుగుల ఎత్తు నుంచి కారుతో బంజీ జంప్
చేజేతులా కాళ్లు విరగొట్టుకున్నాడు.. వీడియో వైరల్