గౌరవ సభను కౌరవ సభగా మార్చుతున్నారు: మాజీ మంత్రి హరీశ్ రావు
ABN , Publish Date - Sep 08 , 2026 | 06:09 PM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే హామీలు నెరవేర్చుతామన్నారని, వెయ్యి రోజుల పాలన పూర్తయినా 6 గ్యారంటీలను అమలు చేయలేదన్నారు.
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డివి డైవర్షన్ పాలిటిక్స్ అని బీఆర్‌ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. అధికారం చేపట్టిన 100 రోజుల్లోనే హామీలు నెరవేర్చుతామన్నారని, వెయ్యి రోజుల పాలన పూర్తయినా 6 గ్యారంటీలను అమలు చేయలేదన్నారు. హామీలు అమలు చేయకుండా విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు సహా అందరినీ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్ తీరుతో ఫీజు రీయింబర్స్‌మెంట్ రాక విద్యార్థులు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు బాధపడుతున్నారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండర్ కాస్తా జాబ్‌లెస్ క్యాలెండర్‌గా మారిందని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ నిరంకుశ పాలనను ప్రజలు గమనిస్తున్నారని, హామీలపై వారికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే యూరియా ఇవ్వకుండా రైతులను ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. 24 గంటల విద్యుత్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారని నిలదీశారు. ఈ సందర్భంగా తెలంగాణలో ప్రజాస్వామ్యం ఎక్కడుంది? అంటూ మాజీ మంత్రి సూటిగా ప్రశ్నించారు.
అసెంబ్లీ ఎదుట తమ మహిళా ఎమ్మెల్యేల గొంతు నొక్కిన దృశ్యాలను అందరూ చూశారని హరీశ్ రావు పేర్కొన్నారు. అన్యాయం జరిగిన మహిళా ఎమ్మెల్యేలపైనే తిరిగి కేసులు పెడుతున్నారని నిప్పులు చెరిగారు. ఈ సందర్భంగా మహిళా ఎమ్మెల్యేలకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. శాసనసభలో చర్చ జరగకుండా డ్రామాలు చేస్తున్నారని, గౌరవ సభను కౌరవ సభగా మార్చుతున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి
సీఎం.. అసెంబ్లీ స్పీకర్ కులాన్ని అడ్డుపెట్టుకొని రాజకీయం చేస్తున్నారు: కేటీఆర్
అసెంబ్లీ స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు.. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కు ఊరట..