లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఇంట్లో ఈ 3 విగ్రహాలు ఉంచాలట!
ABN , Publish Date - Sep 08 , 2026 | 06:27 PM
ఇంట్లో సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరగాలని చాలామంది కోరుకుంటారు. వాస్తు శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేక విగ్రహాలను ఇంట్లో ఉంచడం వల్ల సానుకూల శక్తి, శ్రేయస్సు పెరుగుతాయని నమ్ముతారు.
ఇంటర్నెట్ డెస్క్: వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో కొన్ని వస్తువులు, విగ్రహాలను సరైన ప్రదేశంలో ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇవి ఇంట్లో సానుకూల వాతావరణం, ప్రశాంతత, అదృష్టం, ఐశ్వర్యం పెరగడానికి సహాయపడతాయని నమ్మకం. ముఖ్యంగా కొన్ని విగ్రహాలను ఇంట్లో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని వాస్తు నిపుణులు చెబుతుంటారు.
కామధేనువు విగ్రహం:
వాస్తు ప్రకారం.. ఇంట్లో కామధేనువు విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇది ఇంట్లోని ప్రతికూలతలను తొలగించి సుఖసంతోషాలు, ఐశ్వర్యం పెరగడానికి దోహదపడుతుందని నమ్మకం. ఈ విగ్రహాన్ని పూజ గది, హాల్ లేదా చదువుకునే గదిలో ఉంచుకోవచ్చని చెబుతారు.
తాబేలు విగ్రహం:
హిందూ పురాణాల ప్రకారం.. తాబేలు విష్ణుమూర్తి కూర్మ అవతారానికి ప్రతీక. వాస్తు శాస్త్రంలోనూ తాబేలుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఇంట్లో తాబేలు విగ్రహాన్ని ఉంచితే సంపద, శ్రేయస్సు పెరుగుతాయని నమ్ముతారు. ముఖ్యంగా లోహంతో తయారు చేసిన తాబేలు విగ్రహాన్ని డ్రాయింగ్ రూమ్‌లో ఉంచడం మంచిదని కొందరు వాస్తు నిపుణులు సూచిస్తారు.
ఏనుగు విగ్రహం:
వాస్తు, జ్యోతిష్య నమ్మకాల ప్రకారం.. ఇంట్లో వెండి ఏనుగు విగ్రహాన్ని ఉంచడం శుభప్రదంగా భావిస్తారు. ఇది సంతోషం, శాంతి, సానుకూలతకు ప్రతీకగా చెబుతారు. ఏనుగు గణేశుడితో సంబంధం కలిగి ఉండటంతో అడ్డంకులు తొలగి అదృష్టం కలిసి వస్తుందని కొందరి నమ్మకం.
ఇంట్లో విగ్రహాల విషయంలో ఇవి చేయకండి
ఒకే దేవుడికి సంబంధించిన రెండు విగ్రహాలను ఒకదాని ఎదురుగా మరొకటి ఉంచకూడదని వాస్తు చెబుతుంది.
విరిగిన లేదా దెబ్బతిన్న విగ్రహాలను ఇంట్లో ఉంచుకోకపోవడం మంచిదని భావిస్తారు.
శనిదేవుడి విగ్రహాన్ని, అలాగే దుర్గాదేవి ఉగ్రరూప విగ్రహాలను ఇంట్లో ప్రతిష్ఠించకూడదని కొందరు వాస్తు నిపుణులు చెబుతారు.
Note: ఇందులోని సమాచారం వాస్తు శాస్త్రానికి సంబంధించిన వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.
Also Read:
ఉడికించిన పల్లీలు Vs వేయించిన పల్లీలు.. ఆరోగ్యానికి ఏవి మంచివో తెలుసా?
బేబీమూన్ ప్లాన్ చేస్తున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి!