Share News

అంతరిక్షం నుంచి అమెరికా స్వాతంత్య్ర వేడుకల వ్యూ.. నాసా వీడియో వైరల్

ABN , Publish Date - Jul 11 , 2026 | 07:25 AM

అంతరిక్షం నుంచి చూస్తే భూమిపై జరిగే సంబరాలు ఎలా ఉంటాయో చూపిస్తూ, అమెరికా 250వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా లాస్ ఏంజిల్స్ నగరంలో జరిగిన బాణాసంచా వెలుగుల అద్భుతమైన వీడియోను నాసా సామాజిక మాధ్యమాల్లో పంచుకుంది.

అంతరిక్షం నుంచి అమెరికా స్వాతంత్య్ర వేడుకల వ్యూ.. నాసా వీడియో వైరల్
International Space Station

ఇంటర్నెట్ డెస్క్: జూలై 4 రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్ నగరంలో జరిగిన స్వాతంత్య్ర వేడుకలను నాసా వ్యోమగాములు అంతరిక్షం నుంచి రికార్డ్ చేశారు. భూమికి దాదాపు 400 కిలోమీటర్ల ఎత్తు నుంచి ఈ వీడియోను రికార్డ్ చేశారు. ఈ వీడియోలో అమెరికా నగరం మొత్తం ఎరుపు, తెలుపు, బంగారు రంగుల కాంతులతో మెరిసిపోతూ కనిపించింది. నిత్యం భూమిని చుట్టేసే ఈ స్పేస్ స్టేషన్, దక్షిణ కాలిఫోర్నియా మీదుగా వెళ్తున్నప్పుడు ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. ఈ వీడియో నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.


250 ఏళ్ల స్వతంత్ర సంబరాలు..

అమెరికా చరిత్రలో అత్యంత కీలకమైన 250వ స్వాతంత్య్ర వేడుకలను దేశవ్యాప్తంగా ప్రజలు అత్యంత వైభవంగా జరుపుకొన్నారు. ఈ మైలురాయిని పురస్కరించుకుని దేశంలోని వివిధ నగరాల్లో భారీ పరేడ్‌లు, సంగీత కచేరీలు, డ్రోన్ షోలు, మునుపెన్నడూ లేని విధంగా బాణాసంచా కాల్చారు. ముఖ్యంగా లాస్ ఏంజిల్స్ నగరంలో ఏర్పాటు చేసిన లైటింగ్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతరిక్షం నుంచి నగరాల వెలుగులు చిన్న చిన్న కాంతి చుక్కల్లా కనిపించినప్పటికీ, ఇంతటి భారీ వేడుకల వెలుగులు మాత్రం స్పష్టంగా గుర్తించేలా ఉండటం విశేషం. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన నెటిజన్లు ఇది నిజంగా ఒక అపురూపమైన దృశ్యమని ప్రశంసిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

అంతరిక్షంలోకి వజ్రాన్ని పంపించనున్న భారతీయ కంపెనీ!

మనవడి కోసం పూరీలు చేసిన సీఎం రేవంత్

For More Viral News And Telugu News

Updated Date - Jul 11 , 2026 | 07:53 AM