Share News

ఐరన్ బాక్స్‌పై టీ తయారీ.. వీడియో వైరల్..

ABN , Publish Date - Feb 01 , 2026 | 07:57 PM

ఇటీవల సోషల్ మీడియాలో కామెడీ రీల్స్, డేంజరస్ స్టంట్స్, ఎవరికీ రాని విచిత్రమైన ఐడియాలతో చేసే విన్యాసాలు, భావోద్వేగపూరితమైన క్లిప్స్ క్షణాల్లో వైరల్ అవుతుంటాయి. తాజాగా టీ చేసుకోవడానికి ఓ యువకుడు చేసిన పని చూసి ‘వారెవ్వా ఏం ఐడియా బాసూ’ అంటున్నారు నెటిజన్లు. వివరాల్లోకి వెళితే..

ఐరన్ బాక్స్‌పై టీ తయారీ.. వీడియో వైరల్..
Iron Box Tea Video

ఇంటర్నెట్ డెస్క్: చాలా మందికి ఉదయం గరం గరం టీ గొంతులో పడితే కానీ ఏ పనీ మొదలు కాదు. ఇంట్లో, ఆఫీసులో, బయట.. ఇలా ఎక్కడైనా సరే టీ తాగడానికి ఎంతో ఇష్టం చూపిస్తారు. ఇంట్లో స్టవ్, గ్యాస్ లేకపోతే టీ తయారు చేసుకోవడం ఎంత ఇబ్బందిగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అలా ఇబ్బంది పడే వారి కోసం గల్లీ గల్లీలో టీ స్టాల్స్ ఉంటాయి. కానీ ఓ యువకుడు చేసిన పని చూస్తే.. అబ్బా టీ ఇలా కూడా చేసుకోవచ్చా అని ఆశ్చర్యపోవడమే కాదు, వాట్ ఎన్ ఐడియా అని మెచ్చుకుంటారు. ఒక ఐరన్ బాక్స్‌పై గిన్నె పెట్టి.. అందులో కొంచెం నీరు, టీ పొడి, చక్కర పోసి టీ తయారు చేశాడు. అందులో స్నాక్స్ ముంచి తింటున్న వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


ఈ వీడియో maximum_manthan అనే యూజర్ ద్వారా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. 'వెల్ డన్ సన్, న్యూ జుగాద్' అనే క్యాప్షన్ ఉంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఒక యూజర్ ‘ఇలాంటి వ్యక్తులు ఎక్కడ నుంచి వస్తార్రా?’ అని, మరో యూజర్ ‘భారతీయులు జుగాద్ (స్మార్ట్ ఐడియా)లో ముందంజలో ఉన్నారు’ అని రాశారు. ఇంకో యూజర్ ‘నేను ఈ జుగాద్‌ను మొదటిసారిగా చూస్తున్నా’ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో భలే ట్రెండ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

బడ్జెట్ 2026: ‘ఖేలో ఇండియా మిషన్’కు కేంద్రం శ్రీకారం

కేంద్ర బడ్జెట్ 2026.. మహిళల ఆర్థిక సాధికారతకు పెద్ద పీట

Updated Date - Feb 01 , 2026 | 09:07 PM