కేంద్ర బడ్జెట్ 2026.. మహిళల ఆర్థిక సాధికారతకు పెద్ద పీట
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:49 PM
స్వయం ఉపాధి వ్యాపారవేత్తలైన(సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్స్) మహిళలకు కమ్యూనిటీ ఆధారిత రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా ప్రోత్సాహం అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2026లో మహిళల ఆర్థిక సాధికారతకు పెద్ద పీట వేసింది. స్వయం ఉపాధి వ్యాపారవేత్తలైన(సెల్ఫ్ హెల్ప్ ఎంటర్‌ప్రెన్యూర్స్) మహిళలకు కమ్యూనిటీ ఆధారిత రిటైల్ అవుట్‌లెట్ల ద్వారా ప్రోత్సాహం అందించనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. మహిళల సాధికారత కోసం ‘షీ మార్ట్స్’ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆర్థిక మంత్రి మాట్లాడుతూ.. ‘లఖ్‌పతి దీదీ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అయింది. మహిళల సాధికారత కోసం మరో అడుగు ముందుకు వేస్తూ.. రుణ ఆధారిత జీవనోపాధి అవకాశాలు విస్తరిస్తున్నాం’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి
ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త ఆదాయపు పన్ను చట్టం
పన్ను ఎఫెక్ట్.. నిమిషాల్లో భారీ నష్టాల్లోకి సూచీలు..