Share News

పన్ను ఎఫెక్ట్.. నిమిషాల్లో భారీ నష్టాల్లోకి సూచీలు..

ABN , Publish Date - Feb 01 , 2026 | 12:39 PM

ఫ్యూచర్స్ ట్రేండింగ్‌పై ఎస్‌టీటీని పెంచడం దేశీయ సూచీలపై తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో నిమిషాల వ్యవధిలో దేశీయ సూచీలు లాభాల నుంచి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ ట్యాక్స్ గురించి ప్రకటించిన వెంటనే సెన్సెక్స్ దాదాపు 2800 పాయింట్ల మేర నష్టపోయింది.

పన్ను ఎఫెక్ట్.. నిమిషాల్లో భారీ నష్టాల్లోకి సూచీలు..
stock market crash

ఫ్యూచర్స్ ట్రేండింగ్‌పై ఎస్‌టీటీని పెంచడం దేశీయ సూచీలపై తీవ్ర స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపించింది. దీంతో నిమిషాల వ్యవధిలో దేశీయ సూచీలు లాభాల నుంచి భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ ట్యాక్స్ గురించి ప్రకటించిన వెంటనే సెన్సెక్స్ దాదాపు 2800 పాయింట్ల మేర నష్టపోయింది. ఉదయం 82,726 వద్ద గరిష్టానికి చేరుకున్న సెన్సెక్స్ నిమిషాల వ్యవధిలో దాదాపు 2800 పాయింట్లకు పైగా కోల్పోయి 79,899కు పడిపోయింది. చాలా రోజుల తర్వాత 80 వేల మార్క్ దిగువకు పడిపోయింది.


ప్రస్తుతం మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో సెన్సెక్స్ 1660 పాయింట్లు కోల్పోయి 80, 798 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ కూడా అదే బాటలో సాగుతోంది. ప్రస్తుతం 489 పాయింట్లు కోల్పోయి 24, 831 వద్ద చలిస్తోంది. చాలా రోజుల తర్వాత 25 వేల మార్క్ దిగువకు పడిపోయింది. బ్యాంక్ నిఫ్టీ వెయ్యి పాయింట్లకు పైగా నష్టంతోనూ, మిడ్ క్యాప్ ఇండెక్స్ 1500 పాయింట్లకు పైగా నష్టంతోనూ ఉన్నాయి. దాదాపు అన్ని రంగాలూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి.

Updated Date - Feb 01 , 2026 | 01:21 PM