Share News

సింపుల్‌గా... సినిమా‘ట్రిక్‌’గా...

ABN , Publish Date - May 10 , 2026 | 01:48 PM

ఈరోజుల్లో సృజనాత్మకతకు ఆకాశమే హద్దు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌తో ఫొటోగ్రఫీలో అద్భుతాలు సృష్టిస్తున్నారు.

సింపుల్‌గా... సినిమా‘ట్రిక్‌’గా...
Photography

ఈరోజుల్లో సృజనాత్మకతకు ఆకాశమే హద్దు. ముఖ్యంగా సెల్‌ఫోన్‌తో ఫొటోగ్రఫీలో అద్భుతాలు సృష్టిస్తున్నారు. సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్న కొన్ని వీడియోలను చూస్తే... ప్రొఫెషనల్‌ కెమెరామెన్లకు దీటుగా కుర్రకారు వీడియోలు, ఫొటోలు తీస్తున్నారు. సినిమాల్లో కనిపించే అద్భుత దృశ్యాలను కేవలం తమ సెల్‌ఫోన్‌తో చిత్రీకరించి ‘ఔరా’ అనిపించుకుంటున్నారు.


అలాంటి ఓ అందమైన వీడియోను ఇటీవల కేరళకు చెందిన కృష్ణ ఎస్‌ పాయ్‌ అనే కుర్రాడు ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు. తన ఇంటినే స్టూడియోగా చేసుకుని, ఒక చిన్న కారు బొమ్మ, స్ర్పే బాటిల్‌తో ట్రైపాడ్‌పై సెల్‌ఫోన్‌ ఉంచి... వర్షంలో ఆగి ఉన్న కారును కళాత్మకంగా చిత్రీకరించాడు. చూడచక్కని లైటింగ్‌తో అద్భుత దృశ్యాన్ని ఆవిష్కరించాడు.


వాటిని చూసి ఏకంగా పోర్షే, ఆడీ కార్ల కంపెనీలు కూడా స్పందించడం విశేషం. దీనితో అతడి పోస్ట్‌ మరింత పాపులర్‌ అయ్యింది. కేవలం తనకున్న వనరులతో, పాయ్‌ సృజనాత్మకంగా ఈ వీడియో చేయడం పట్ల నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అయితే ఈ ప్రయోగం చేయడానికి అతడు ఎంతో ఓపికను, కళాత్మకతను ప్రదర్శించాడనేది నిజం.


ఈ వార్తలు కూడా చదవండి:

సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. అంబరాన్ని అంటిన సంబరాలు..

ఎలుకల నుంచి మనుషులకు హంటా వైరస్..

Read Latest Telangana News and National News

Updated Date - May 11 , 2026 | 03:37 PM