Share News

వాటర్ ట్యాంక్‌ మురికిగా ఉందా? ఇలా క్లీన్ చేయండి

ABN , Publish Date - May 10 , 2026 | 01:26 PM

చాలామంది ఇంట్లో వాటక్ ట్యాంక్‌ను నెలల తరబడి శుభ్రం చేయకుండా వదిలేస్తారు. దీంతో ట్యాంక్‌లో మురికి, ధూళి పేరుకుపోయి నీటి నాణ్యత దెబ్బతింటుంది. కొన్ని సులభమైన చిట్కాలతో పెద్దగా శ్రమ లేకుండానే నీటి ట్యాంక్‌ను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుందాం..

వాటర్ ట్యాంక్‌ మురికిగా ఉందా? ఇలా క్లీన్ చేయండి
Water Tank Cleaning Tips

ఇంటర్నెట్ డెస్క్: ఇంట్లో ఉపయోగించే నీరు శుభ్రంగా ఉండాలంటే, నీటి ట్యాంక్ కూడా పరిశుభ్రంగా ఉండాలి. కానీ చాలామంది ట్యాంక్‌ను నెలల తరబడి శుభ్రం చేయకుండా వదిలేస్తారు. దీంతో ట్యాంక్ అడుగున మురికి, ధూళి పేరుకుపోతాయి. ముఖ్యంగా వేసవిలో ట్యాంక్ శుభ్రంగా లేకపోతే నీటి ద్వారా అనారోగ్యాలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అయితే, కొన్ని సులభమైన చిట్కాలతో పెద్దగా శ్రమ లేకుండానే నీటి ట్యాంక్‌ను శుభ్రం చేయవచ్చు.


బ్లీచింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడా

వాటర్ ట్యాంక్‌ను సులభంగా, శుభ్రంగా ఉంచుకోవడానికి ముందుగా ట్యాంక్‌లోని నీటిని పూర్తిగా ఖాళీ చేయాలి. తర్వాత బ్రష్‌తో లోపలి భాగాలను స్క్రబ్ చేయాలి. బ్లీచింగ్ పౌడర్ లేదా బేకింగ్ సోడాతో శుద్ధి చేసి, ఆపై స్వచ్ఛమైన నీటితో బాగా కడగాలి. ట్యాంక్ శుభ్రం చేసిన తర్వాత మూతను బాగా మూసేయాలి. లేకపోతే మళ్లీ దుమ్ము, కీటకాలు లోపలికి వెళ్లే అవకాశం ఉంటుంది. ప్రతి 3 నుంచి 6 నెలలకు ఒకసారి ట్యాంక్ శుభ్రం చేస్తే నీరు పరిశుభ్రంగా ఉంటుంది. అలాగే కుటుంబ ఆరోగ్యం కూడా కాపాడుకోవచ్చు.

జాగ్రత్త

  • ట్యాంక్ లోకి దిగేటప్పుడు సురక్షితమైన నిచ్చెనను ఉపయోగించాలి.

  • శుభ్రమైన నీరు మంచి ఆరోగ్యానికి చాలా అవసరం. అందుకే నీటి ట్యాంక్‌ను క్రమం తప్పకుండా శుభ్రం చేయడం అలవాటు చేసుకోవాలి.


Note: ఇందులోని సమాచారం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా మీకు అందించడం జరుగుతోంది. ABN ఆంధ్రజ్యోతి దీనిని ధ్రువీకరించడం లేదు.

Also Read:

ఆఫీసులో గంటల తరబడి కూర్చుంటున్నారా? మీ ఆరోగ్యం ప్రమాదంలో ఉన్నట్టే!

ప్రకృతి ప్రసాదించిన యాంటీ బయాటిక్స్.. రోగనిరోధక శక్తిని పెంచే 'సూపర్ మసాలాలు' ఇవే!

For More Latest News

Updated Date - May 10 , 2026 | 01:38 PM