Share News

ప్రధాని మోదీ.. మా ఇంటికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - May 10 , 2026 | 12:59 PM

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు.

ప్రధాని మోదీ.. మా ఇంటికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నా: సీఎం చంద్రబాబు

హైదరాబాద్, మే10: జూబ్లీహిల్స్‌లోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధానికి ఆత్మీయ స్వాగతం పలుకుతూ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతా వేదికగా స్పందించారు. ప్రధాని మోదీ తమ ఇంటికి రావడాన్ని గౌరవంగా భావిస్తున్నామన్నారు. ప్రధాని మోదీకి స్వగృహంలో ఆతిథ్యం ఇవ్వడం.. తమ కుటుంబానికి ప్రత్యేకమైన సందర్భం అని ఆయన అభివర్ణించారు. ఈ రోజు తమ కుటుంబానికి చిరస్మరణీయమైన రోజు అని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఒక్క రోజు పర్యటన కోసం ప్రధాని మోదీ ఈ రోజు హైదరాబాద్ వస్తున్నారు. బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో ఆదివారం మధ్యాహ్నం ఆయన హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయాన్ని చేరుకుంటారు. అనంతరం హైటెక్స్‌ వేదికగా రాష్ట్రంలోని పలు ప్రాజెక్ట్‌ల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం ఒక ప్రైవేట్ ఆసుపత్రిని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.


ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నివాసాలకు ప్రధాని మోదీ వెళ్లనున్నారు. ఆ తర్వాత సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరవుతారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సభ ముగిసిన తర్వాత గుజరాత్‌లోని జామ్ నగర్‌కు ప్రధాని మోదీ బయలుదేరి వెళ్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ.. ఎవ్వరూ చేయొద్దు: లోకేశ్

శంషాబాద్ సమీపంలో దారి దోపిడి.. దొంగలు అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2026 | 01:18 PM