Share News

అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ.. ఎవ్వరూ చేయొద్దు: లోకేశ్

ABN , Publish Date - May 10 , 2026 | 09:44 AM

మదర్స్ డే నేడు. ఈ నేపథ్యంలో తన తల్లి నారా భువనేశ్వరికి ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి, టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం తన ఎక్స్ ఖాతా వేదికగా నారా లోకేశ్ స్పందించారు.

అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ.. ఎవ్వరూ చేయొద్దు: లోకేశ్

అమరావతి, మే 10: మదర్స్ డే నేడు. ఈ నేపథ్యంలో తన తల్లి నారా భువనేశ్వరికి ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యా శాఖ మంత్రి, టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ మదర్స్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఆదివారం తన ఎక్స్ ఖాతా వేదికగా నారా లోకేశ్ స్పందించారు. ‘ కనిపించే ప్రతి స్త్రీ.. కని పెంచిన అమ్మతో సమానం. మనల్ని ఈ లోకానికి పరిచయం చేసిన అమ్మకు చెప్పలేని పని ఎప్పుడూ, ఎవ్వరూ చేయొద్దు. ఇదే ప్రతి అమ్మ కోరుకునే కానుక. చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించడం, స్త్రీ పురుషులు సమానం అనే భావన నాలో పెంపొందించింది అమ్మ.


నా తల్లి స్ఫూర్తితోనే విద్యా శాఖలో నైతిక విలువల పాఠాలు ప్రవేశపెట్టాం. మహిళా సాధికారత లక్ష్యంగా ప్రజా ప్రభుత్వం మహిళలకు స్త్రీ శక్తి పేరుతో ఉచిత బస్సు ప్రయాణం, దీపం 2 పథకం కింద ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందిస్తుంది. బిడ్డలకు గురువు, దైవం, మార్గదర్శి రూపంలో అన్నీ తానైన మాతృమూర్తులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. లవ్ యూ అమ్మా’ అని నారా లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

హైదరాబాద్‌లో 'తలసేమియా రన్'.. జెండా ఊపి ప్రారంభించిన నారా భువనేశ్వరి

శ్రీసిటీలో ఏసీ పరిశ్రమలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన

Read Latest AP News And Telugu News

Updated Date - May 10 , 2026 | 09:56 AM