హైదరాబాద్‌లో 'తలసేమియా రన్'.. జెండా ఊపి ప్రారంభించిన నారా భువనేశ్వరి
ABN , Publish Date - May 10 , 2026 | 08:23 AM
సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.
హైదరాబాద్, మే 10: సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎప్పుడూ ముందుండే ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్.. తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు మరో కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ మేరకు హైదరాబాద్‌లోని నెక్లెస్ రోడ్డు వేదికగా భారీ 'తలసేమియా రన్' నిర్వహించనున్నట్లు ట్రస్ట్ ప్రతినిధులు వెల్లడించారు. నగరంలోని జలవిహార్ నుంచి ప్రారంభమైన ఈ రన్‌కు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నారా భువనేశ్వరి జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ.. ‘తలసేమియాతో చాలా మంది చిన్నారులు చనిపోతున్నారు. బాధితులను కాపాడేందుకు రక్తమార్పిడి ఒక్కటే మార్గం. రక్తదానం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలూ రావు. దేశంలో ఏటా 12 వేలమంది తలసేమియాతో జన్మిస్తున్నారు. తలసేమియా బాధితులకు రక్తదానం బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. యువత తప్పనిసరిగా స్క్రీనింగ్ చేయించుకోవాలి. విజయవాడ, అనంతపురంలో తలసేమియా కేంద్రాలు, బ్లడ్ బ్యాంక్‌లు ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా తలసేమియా బాధితులకు ఉచితంగా రక్తాన్ని అందించడంతో పాటూ వారికి అవసరమైన వైద్య సేవలను ఎన్టీఆర్ ట్రస్ట్ నిరంతరం అందిస్తోంది’ అని అన్నారు.
ఇవి కూడా చదవండి...
ముగిసిన కస్టడీ.. పోలీసులకు సహకరించని అనంత బాబు
శ్రీసిటీలో ఏసీ పరిశ్రమలకు మంత్రి లోకేశ్ శంకుస్థాపన
Read Latest AP News And Telugu News