12 ఏళ్ల తరువాత నడిచిన యువతి.. జీవితాల్లో వెలుగులు నింపుతున్న టెక్నాలజీ
ABN , Publish Date - Oct 15 , 2026 | 09:51 AM
లెబనాన్‌కు చెందిన జెస్సికా టవిల్ 2014లో ఓ ఘోర ప్రమాదానికి గురయ్యారు. అప్పటి నుంచి ఆమె వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు. అయితే ప్రస్తుత టెక్నాలజీ జెస్సికా జీవితంలో వెలుగు నింపుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టెక్నాలజీ అందరికీ సౌకర్యాన్ని ఇస్తుంది. కొందరికి మాత్రం జీవితాన్నే ఇస్తోంది. నిరాశ, నిస్పృహల మధ్య మగ్గిపోతున్న కొంతమంది జీవితాల్లో వెలుగులు నింపుతోంది. ఈ మాటలకు జెస్సికా టవిల్ అనే యువతి కథ అద్దం పడుతోంది. లెబనాన్‌కు చెందిన ఆమె 2014లో ఓ ఘోర ప్రమాదానికి గురయ్యారు. కారు ప్రమాదంలో ఆమె వెన్నుపూసకు తీవ్ర గాయమైంది. దీంతో శరీరంలోని కింది భాగం కదలికను పూర్తిగా కోల్పోయింది. దీనినే పారాప్లీజియా అని అంటారు. అప్పటి నుంచి ఆమె వీల్‌చైర్‌కే పరిమితమయ్యారు.
వీల్‌చైర్‌లో కూర్చొని కూర్చొని విసిగిపోయిన ఆమె కథలో టెక్నాలజీ మార్పు తీసుకొచ్చింది. ‘ఈవ్’ అనే రోబోటిక్ ఎక్సోస్కెలిటన్ పరికరం జెస్సికాకు సహాయంగా నిలిచింది. దీని సహాయంతో ఆమె 12 ఏళ్ల తరువాత మళ్లీ నిలబడ్డారు. అటూ ఇటూ అడుగులు వేశారు. దీంతో ఆ మహిళ ఆనందానికి అవధుల్లేవు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియో వైరలవుతోంది. జెస్సికాను చూసిన నెటిజన్లు భావోద్వేగం చెందుతున్నారు. ఇన్నేళ్ల తరువాత మళ్లీ ఆమె నడుస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఎక్సోస్కెలిటన్ మెకానికల్ సపోర్ట్‌తో నిలబడటానికి, నడవడానికి సహాయపడుతుంది. పక్షవాతంతో బాధపడుతున్నవారికి ఇలాంటి టెక్నాలజీలు కొత్త ఆశలు కల్పిస్తున్నాయి.
ఇవీ చదవండి
ఐఫోన్‌తో పారిపోయిన వ్యక్తి.. వెంబడించిన యజమాని.. చివరకు..
కూరగాయలు కొంటూ గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. వీడియో వైరల్