Share News

ఐఫోన్‌తో పారిపోయిన వ్యక్తి.. వెంబడించిన యజమాని.. చివరకు..

ABN , Publish Date - Oct 14 , 2026 | 08:55 PM

పంజాబ్‌లోని లూధియానాలో ఐఫోన్ చోరీ ఘటన కలకలం రేపింది. ఫోన్ దొంగిలించి స్కూటర్‌పై పారిపోతున్న వ్యక్తిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన దుకాణదారుడిని నిందితుడు రోడ్డుపై సుమారు 15 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. చివరకు ఏమైందో మీరే చూడండి..

ఐఫోన్‌తో పారిపోయిన వ్యక్తి.. వెంబడించిన యజమాని.. చివరకు..
Ludhiana iPhone Theft

ఇంటర్నెట్ డెస్క్: పంజాబ్‌లోని లూధియానాలో ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను దొంగిలించి పారిపోయేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తిని అడ్డుకునే క్రమంలో దుకాణదారుడు గాయపడ్డాడు. ఐఫోన్‌ను తీసుకుని యాక్టివా స్కూటర్‌పై పారిపోతున్న నిందితుడిని పట్టుకునేందుకు మీత్ అనే దుకాణదారుడు వాహనం వెనుక క్యారియర్‌ను గట్టిగా పట్టుకున్నాడు. అయినప్పటికీ నిందితుడు స్కూటర్‌ను వేగంగా నడపడంతో మీత్ దాదాపు 10 నుంచి 15 మీటర్ల దూరం రోడ్డుపై ఈడ్చుకెళ్లబడ్డాడు. చివరకు స్కూటర్ అదుపుతప్పి నిందితుడు కిందపడటంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో దుకాణదారుడి మోకాళ్లకు గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.


మీత్ తెలిపిన వివరాల ప్రకారం.. నిందితుడు తొలుత ఉదయం 11 గంటల సమయంలో దుకాణానికి వచ్చి.. ఐఫోన్‌ను వాయిదాల పద్ధతిలో కొనుగోలు చేసే విషయమై ఆరా తీశాడు. అనంతరం మధ్యాహ్నం 2.55 గంటల సమయంలో తిరిగి వచ్చి, ఫోన్లను పరిశీలిస్తున్నట్లు నటిస్తూ ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్‌ను తీసుకుని చొక్కాలో దాచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆపై దుకాణం నుంచి బయటకు వెళ్లి స్కూటర్‌పై పారిపోవడానికి ప్రయత్నించాడు. అతడిని అడ్డుకునేందుకు మీత్ వెంబడించినప్పటికీ గాయాలపాలయ్యాడు. స్కూటర్ కిందపడిన తర్వాత నిందితుడు ఫోన్‌తో పాటు వాహనాన్ని అక్కడే వదిలేసి పరారైనట్లు సమాచారం. సమీపంలోని దుకాణదారులు తనకు సహాయం చేయలేదని మీత్ ఆవేదన వ్యక్తం చేశాడు. నిందితుడిని గుర్తించేందుకు.. ఘటనకు సంబంధించిన వివరాలను నిర్ధారించేందుకు సీసీటీవీ ఫుటేజ్ కీలకంగా మారనున్నట్లు మీత్ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ

మటన్ మండిలో పుచ్చిపోయిన పన్ను.. హైదరాబాద్ రెస్టారెంట్‌లో కలకలం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 08:59 PM