Share News

కూరగాయలు కొంటూ గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. వీడియో వైరల్

ABN , Publish Date - Oct 14 , 2026 | 09:25 PM

కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన ఓ వ్యక్తి.. వాటిని చేతికి అందుకునేలోపే ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. కళ్లముందే జరిగిన ఈ ఘటనతో అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారు. వెంటనే సీపీఆర్ చేసి ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది.

కూరగాయలు కొంటూ గుండెపోటుతో కుప్పకూలిన వ్యక్తి.. వీడియో వైరల్
Heart Attack News

సూర్యాపేట, అక్టోబర్ 14: జిల్లాలోని కోదాడ నియోజకవర్గంలోని చిలుకూరు మండలం బేతవోలు గ్రామంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. కూరగాయలు కొనుగోలు చేసేందుకు మార్కెట్‌కు వెళ్లిన ఓ వ్యక్తి.. ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.

బేతవోలు గ్రామానికి చెందిన బెజవాడ శ్రీనివాస్ (46) మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో కూరగాయల దుకాణం వద్దకు వెళ్లాడు. అతడు కొనుగోలు చేసిన కూరగాయలను దుకాణం నిర్వాహకురాలు కవర్‌లో పెట్టి అందిస్తుండగా, శ్రీనివాస్ దానిని అందుకునేలోపే ఒక్కసారిగా స్పృహ కోల్పోయి అక్కడే ఉన్న బండిపై పడిపోయాడు. ఈ అనూహ్య పరిణామంతో సమీపంలో ఉన్నవారు ఆందోళనకు గురయ్యారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు దుకాణం వద్ద ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి.


శ్రీనివాస్ కుప్పకూలిపోవడంతో అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించి అతడికి సీపీఆర్ నిర్వహించి ప్రాణాలు కాపాడేందుకు ప్రయత్నించారు. అనంతరం కోదాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే.. అప్పటికే శ్రీనివాస్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. గుండెపోటు కారణంగానే ఆయన మరణించినట్లు సమాచారం. క్షణాల్లో జరిగిన ఈ ఘటనతో బేతవోలు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. శ్రీనివాస్ మృతితో ఆయన కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబానికి అండగా ఉన్న వ్యక్తి ఆకస్మికంగా మృతి చెందడంతో స్థానికులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పవన్ సమక్షంలో జనసేనలో చేరిన వంగవీటి రాధాకృష్ణ

మటన్ మండిలో పుచ్చిపోయిన పన్ను.. హైదరాబాద్ రెస్టారెంట్‌లో కలకలం

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 14 , 2026 | 09:46 PM