Share News

రైలు ఇంజిన్లపై ఉన్న అక్షరాలకు అర్థమేంటో తెలుసా?

ABN , Publish Date - Mar 22 , 2026 | 09:45 AM

భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థలో ఒకటి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్య స్థానానికి చేరవేసే ఈ వ్యవస్థ వెనుక పక్కగా రూపొందించిన సాంకేతిక క్రమశిక్షణ ఉంటుంది.

రైలు ఇంజిన్లపై ఉన్న అక్షరాలకు అర్థమేంటో తెలుసా?

ఇంటర్నెట్ డెస్క్: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థలలో ఒకటి. ప్రతిరోజూ లక్షలాది మంది ప్రయాణికులను వారి గమ్య స్థానానికి చేరవేసే ఈ వ్యవస్థ వెనుక పక్కాగా రూపొందించిన సాంకేతిక క్రమశిక్షణ ఉంటుంది. మనం రైల్వే స్టేషన్‌లో రైలు కోసం ఎదురు చూస్తున్నప్పుడు పట్టాల పక్కన, రైలు బోగీలపై, ఇంజిన్ల మీద కొన్ని రకాల అక్షరాలు, గుర్తులు కనిపిస్తుంటాయి. చాలా మంది ఇవి కేవలం ఇంగ్లీష్ అక్షరాలు, సింబల్స్ అని అనుకుంటారు. కానీ, ప్రతి అక్షరం వెనుక ఎంతో అర్థం ఉంటుంది. మరి వాటి అర్థం ఏంటో తెలుసుకుందాం.


భారతీయ రైల్వే ఇంజిన్‌పై ఉండే అక్షరాల అర్థం:

రైల్ ఇంజిన్‌పై WAP అని ఉంటే.. అది W (బ్రాడ్ గేజ్), A (విద్యుత్ శక్తి), P (ప్రయాణికుల రైలు) అని అర్థం.

W (Broad Gauge) దీనిని ‘బ్రాడ్ గేజ్’ అంటారు. ప్రస్తుతం భారత దేశంలోని అన్ని ప్రధాన మార్గాల్లో ఇవే రైళ్లు నడుస్తున్నాయి.

Y (Metre Gauge) అంటే ‘మీటర్ గేజ్’ అని అంటారు. ప్రస్తుతం ఇవి చాలా తక్కువ ప్రాంతాలకు పరిమితమయ్యాయి.

Z (Narrow Gauge) అంటే 'నారో గేజ్'. ఇవి సాధారణంగా కొండ ప్రాంతాల్లో నడిచే ‘టాయ్ ట్రైన్స్’ (ఉదా: ఊటి, డార్జిలింగ్)కు మాత్రమే ఉపయోగిస్తారు.

A (AC Electric) ఏసీ విద్యుత్ శక్తితో నడిచే ఇంజిన్

D (Diesel) డీజిల్ ఇంధనంతో నడిచే ఇంజిన్.

P (Passenger) ఇది కేవలం ప్రయాణికుల రైళ్లను లాగడానికి వాడేది.

G (Goods) కేవలం సరకు రవాణా (మాల్‌గాడి) రైళ్లకు వాడేది.

M (Mixed) దీన్ని ప్రయాణికుల, సరకు రవాణా.. రెండింటికీ వాడుతారు.

S (Shunting) ఫ్లాట్ ఫారమ్‌ల వద్ద ఖాళీ రైలు పెట్టెలను సర్దడానికి వాడే చిన్న ఇంజిన్


రైలు పట్టాల పక్కన ఉండే సూచికలు:

రైలు ప్రయాణంలో పట్టాల పక్కన పసుపు రంగు బోర్డులపై నలుపు అక్షరాలతో కొన్ని రకాల గుర్తులు కనిపిస్తాయి. అవి డ్రైవర్‌కు ఇచ్చే సంకేతలు, ఆ గుర్తుల వల్ల రైలు ప్రయాణం సురక్షితంగా కొనసాగిస్తారు.

W/L (Whistle for Level Crossing) బోర్డు, రాబోయే లెవెల్ క్రాసింగ్ వద్ద లోకో పైలట్ (రైలు డ్రైవర్) తప్పనిసరిగా విజిల్/హార్న్ వేయాలని సూచిస్తుంది.

W/B (Whistle for Bridge) దీని అర్థం ముందు (Bridge) ఉందని, భద్రతా దృష్ట్యా హారన్ మోగించాలని డ్రైవర్ గ్రహించి జాగ్రత్త పడతారు.

P (Termination of Speed Restriction): రైలు సాధారణ వేగాన్ని తగ్గించుకొని.. పెంచడాన్ని సూచిస్తుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

అకాల వర్షాలతో పంట దెబ్బతిన్న రైతన్నలను ఆదుకుంటాం: సీఎం చంద్రబాబు

దేవుడి సాక్షిగా నేను రాసినవన్నీ నిజాలే.. వైఎస్ విజయలక్ష్మి షాకింగ్ కామెంట్స్

‘ఆస్కార్’ రేంజ్‌లో అవినాశ్‌ ప్రెస్‌మీట్.. బీటెక్ రవి సెటైర్లు

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Mar 22 , 2026 | 11:12 AM