నడిరోడ్డుపై బైక్‌తో తాతయ్య వీరవిహారం.. వీడియో వైరల్
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:50 PM
ఓ తాతయ్య నడిరోడ్డుపై వీరవిహారం చేశాడు. చేతులు వదిలేసి బైక్ నడిపాడు. అటు ఇటు వాటర్ క్యాన్లు పెట్టుకుని రోడ్డుపై దూసుకెళ్లాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: రోడ్డుపై వాహనాన్ని నడిపేటప్పుడు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా.. ప్రాణానికే ప్రమాదం. అందుకే వాహనాన్ని నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్మెట్ పెట్టుకోవాలి. కారులో ప్రయాణిస్తే సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. ఒక్కోసారి మనం ఎంత జాగ్రత్తగా నడిపినా.. ఎదురుగా వచ్చే వాహనం మనల్ని ఢీకొడుతుంది. అందుకే ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ ఒకటికి పదిసార్లు పోలీసులు సూచిస్తారు. కానీ ఓ తాతయ్య రోడ్డుపై తన బైక్‌ను ఇష్టారీతిగా నడుపుతున్నాడు. చేతులు వదిలేసి.. వాహనాన్ని నడుపుతున్నాడు. ఆ వీడియో వైరల్ అవుతోంది.
నెరిసిన గడ్డంతో ఉన్న ఆ వ్యక్తి రోడ్డుపై అడ్డదిడ్డంగా వాహనాన్ని నడుపుతున్నాడు. దానికి అటు ఇటు వాటర్ క్యాన్లు పెట్టుకుని కూడా తీవ్ర నిర్లక్ష్యంగా అతడు వ్యవహరిస్తున్నాడు. ఇతర వాహనాలు వెళ్తున్నా.. వాటిని పట్టించుకోకుండా రోడ్డుపై దూసుకుపోతున్నాడు. రోడ్డుపై ఈ తాతయ్య విన్యాసాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. ఈ వీడియోను ‘itsriaz011’అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఇప్పటి వరకు లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. సుమారు 2 లక్షల మంది లైక్ చేశారు. కొందరు అంకుల్ చాలా అద్భుతంగా ఉన్నారని అంటున్నారు. మరికొందరు తాతయ్య స్వాగ్ చూసి మైండ్ బ్లాంక్ అయిపోయిందని చెబుతున్నారు. మరి కొందరు మాత్రం ఇలా చేస్తే ప్రమాదం తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
సెల్‌ఫోన్ ఫ్లాష్ లైట్ వెలుగులో రైల్వేట్రాక్‌పై ప్రయాణికుల నడక.. వీడియో వైరల్
రైలు ఆపి సమోసాలు కొన్న లోకో పైలట్.. వీడియో వైరల్
For More Viral News And Telugu News