Share News

కాకులకు పనికి ఆహారం

ABN , Publish Date - Jun 21 , 2026 | 01:02 PM

జనాలు ఒకదగ్గర గుమిగూడే చోట, ఫుట్‌పాత్‌లపై, షాపింగ్‌ కూడళ్లలో... పొగరాయుళ్లు విసిరేసే లెక్కలేనన్ని సిగరెట్‌ పీకలు కనిపించి, ఒకింత చిరాకు తెప్పిస్తాయి.

కాకులకు పనికి ఆహారం
Crows

జనాలు ఒకదగ్గర గుమిగూడే చోట, ఫుట్‌పాత్‌లపై, షాపింగ్‌ కూడళ్లలో... పొగరాయుళ్లు విసిరేసే లెక్కలేనన్ని సిగరెట్‌ పీకలు కనిపించి, ఒకింత చిరాకు తెప్పిస్తాయి. కొన్నిసార్లు అలాంటి చోట నడవాలంటేనే అసహ్యమేస్తుంది. వాటిని ఏరివేయాలంటే పారిశుద్ధ్య కార్మికులకు కూడా ఒకింత కష్టమే. దానికో గమ్మత్తయిన పరిష్కారాన్ని కనిపెట్టింది స్వీడన్‌ పురపాలక సంస్థ. అదే ‘బట్స్‌ ఫర్‌ నట్స్‌’ ఆపరేషన్‌.

స్వీడన్‌లో ఎక్కడ చూసినా సిగరెట్‌ పీకలే కనిపిస్తుంటాయి. వీటిని శుభ్రం చేయడానికి అక్కడి పురపాలక సంఘం ఏటా సుమారు 20 కోట్ల రూపాయలను (స్వీడిష్‌ క్రోనర్లు) ఖర్చు చేస్తోంది. దాంతో కార్విడ్‌ క్లీనింగ్‌ అనే స్వీడిష్‌ స్టార్టప్‌ సోడెర్టాల్జే నగరంలో ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. పీకలను ఏరిపారేయడానికి వాళ్లు కాకులను వినియోగిస్తున్నారు. కాకులకు వీధుల్లోని సిగరెట్‌ పీకలను సేకరించేలా శిక్షణ ఇచ్చారు.


book10.jpgకాకులు చాలా తెలివైనవి. అవి త్వరగా నేర్చుకుంటాయని ఈ తరహా పైలెట్‌ ప్రోగ్రామ్‌ని మొదలుపెట్టారు. కాకులు సిగరెట్‌ పీకలను ముక్కుతో పట్టుకుని అక్కడ ఉంచిన బర్డ్‌ బిన్‌లో వేస్తాయి. ఈ బర్డ్‌ బిన్‌లో సిగరెట్‌ పీకలను, ఆకులను లేదా రాళ్ల వంటి వస్తువులను గుర్తించగల ఒక ప్రత్యేకమైన కెమెరా ఉంటుంది. దీనివల్ల సిగరెట్‌ పీకలను వేయగానే ఆ మెషీన్‌ కాకికి ఆహారాన్ని (నట్స్‌) అందిస్తుంది. పైలట్‌ ప్రాజెక్ట్‌ కాబట్టి ప్రయోగ దశలోనే ఉందని చెప్పాలి. అయితే ఐడియా మాత్రం అదిరిందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తొలి లడ్డూ ‘కసార’

మరవలేని మన ‘డిటెక్టివ్‌’...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Jun 21 , 2026 | 01:27 PM