Share News

అడవి కాదు... చెట్టు

ABN , Publish Date - Oct 04 , 2026 | 12:42 PM

పార్కు అంటే... బెంచీలు, వివిధ రకాల చెట్ల సమూహంతో నిండి ఉంటుంది. కానీ ఆ పార్కులో మాత్రం ఒక జీడిమామిడి చెట్టే అడవిని తలపిస్తుంది.

అడవి కాదు... చెట్టు
Guinness World Records

పార్కు అంటే... బెంచీలు, వివిధ రకాల చెట్ల సమూహంతో నిండి ఉంటుంది. కానీ ఆ పార్కులో మాత్రం ఒక జీడిమామిడి చెట్టే అడవిని తలపిస్తుంది. ఆ చెట్టు ఏకంగా 2 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. సుమారు 130 ఏళ్ల నాటి చెట్టును ఇంకా అక్కడ భద్రంగా కాపాడుతున్నారు.

బ్రెజిల్‌లోని సముద్రతీరం పక్కన ఉన్న ఓ పార్కు అన్ని పార్కుల్లాగే ఆహ్లాదభరితంగా ఉంటుంది. అయితే దానికో ప్రత్యేకత ఉంది. పార్కులోని జీడిమామిడి చెట్టు ప్రపంచంలోనే అతి పెద్ద చెట్టుగా ‘గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌’లో చోటు సంపాదించుకుంది. సదరు చెట్టు విస్తీర్ణం రెండు ఫుట్‌బాల్‌ మైదానాలంత విస్తీర్ణాన్ని ఆక్రమించింది.


book10.jpgఅది ఇంకా పెరుగుతూనే ఉంది. సుమారు 70 సాధారణ జీడి మామిడి చెట్ల పరిమా ణంలో ఉండే గిన్నిస్‌ చెట్టు కొమ్మలు, ప్రధాన కాండం నుంచి 50 మీటర్ల దూరం వరకు విస్తరించిఉంటాయి. దాని కొమ్మల కింద నడుస్తూ ముందుకు వెళితే... బాప్‌రే అంటారెవరైనా. అంతేనా... ఇప్పటికీ ఈ చెట్టు ద్వారా ఏడాదికి 80 వేల జీడిపప్పుల దిగుబడి వస్తుం దట. పార్కులో తిరిగేవారు... ఆ చెట్టుతో ఫొటోలు దిగుతూ, జీడిపండ్ల రుచిని ఆస్వాదిస్తుంటారు.


ఈ వార్తలు కూడా చదవండి:

తొలి ఏడాది తీపి గుర్తులు!

అది మర్యాద కాదు...

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 12:49 PM