Share News

చెక్క వంతెనపై బైక్‌తో సాహసం.. షాకింగ్ వీడియో వైరల్

ABN , Publish Date - Jul 22 , 2026 | 04:12 PM

సాహసం పేరుతో కొందరు చేసే ప్రమాదకర విన్యాసాలు క్షణాల్లో ప్రాణాపాయ పరిస్థితులను సృష్టిస్తుంటాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ వీడియోలో చెక్క వంతెనపై బైక్‌తో వెళ్లిన ఓ యువకుడు త్రుటిలో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. గుండెల్లో గుబులు పుట్టించే ఈ ఘటన వివరాల్లోకెళ్తే...

చెక్క వంతెనపై బైక్‌తో సాహసం.. షాకింగ్ వీడియో వైరల్
Wooden Bridge Accident

ఇంటర్నెట్ డెస్క్: సోషల్ మీడియా పుణ్యమా అని నిత్యం ఎన్నో రకాల వీడియోలు చూసే అవకాశం కలుగుతోంది. వాటిలో కొన్ని వినోదాన్ని పంచుతుంటే.. మరికొన్ని ఉత్కంఠను కలిగిస్తుంటాయి. తాజాగా అలాంటి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రమాదకరమని తెలిసినా కొందరు ఎలా ప్రాణాలను పణంగా పెట్టి రిస్క్‌లు చేస్తారో ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలియనప్పటికీ.. ఓ పర్వత ప్రాంతంలో ఉన్న సన్నని చెక్క వంతెన కనిపిస్తోంది.

ఈ వంతెనను జనాలు నడిచేందుకు నిర్మించినట్లు కనిపిస్తున్నప్పటికీ.. కొందరు యువకులు దానిపై బైక్‌లతో ప్రయాణించేందుకు ప్రయత్నించారు. ఓ వ్యక్తి ఎలాంటి ఇబ్బంది లేకుండా వంతెన దాటగా, మరో యువకుడికి మాత్రం ప్రమాదం తప్పలేదు. బైక్‌తో వంతెన దాటే ప్రయత్నంలో ఆ యువకుడు ఒక్కసారిగా బ్యాలెన్స్ తప్పి వంతెన పక్కకు జారిపోయాడు. అయితే అదృష్టవశాత్తూ వంతెనకు ఉన్న హ్యాండిల్‌ను గట్టిగా పట్టుకోవడంతో అతడు నీటిలో పడకుండా తప్పించుకున్నాడు. వెంటనే అక్కడికి వచ్చిన మరో వ్యక్తి అతడిని సురక్షితంగా పైకి లాగడంతో పెను ప్రమాదం తప్పినట్టైంది!


ఈ వీడియో @jamalk38అనే యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ ‘ఇలాంటి రిస్క్‌లు ఎందుకు తీసుకోవాలి?’ అని, ‘వైరల్ కావడం కోసం ప్రాణాలతో ఆడుకోవద్దు’ అని మరొకరు, ‘జస్ట్ మిస్.. లేకుంటే పైకి టికెట్ తీసుకునేవాడు’ అని మరో నెటిజన్ కామెంట్ చేశారు.


ఇవి కూడా చదవండి..

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి రండి.. ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం

అమరావతి అభివృద్ధిలో రైతుల సహకారం కీలకం: మంత్రి నారాయణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 05:18 PM