Share News

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి రండి.. ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం

ABN , Publish Date - Jul 22 , 2026 | 01:48 PM

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు.

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి రండి.. ప్రధానికి సీఎం చంద్రబాబు ఆహ్వానం
CM Chandrababu Naidu

న్యూఢిల్లీ, జులై 22: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆగస్టు 1న భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ప్రధానిని ఆహ్వానించారు. ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి వచ్చేందుకు ప్రధాని మోదీ అంగీకరించినట్లు తెలుస్తోంది. సుమారు 30 నిమిషాలకు పైగా చంద్రబాబు, మోదీ ముఖాముఖీ భేటీ అయ్యారు. దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చలు జరిగినట్లు సమాచారం. ఈరోజు(బుధవారం) చంద్రబాబుతో పాటు కేంద్రమంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాసవర్మ, ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు, కలిశెట్టి అప్పలనాయుడు కూడా ప్రధానిని కలిశారు.


ఎంపీ అప్పలనాయుడికి ప్రధాని ప్రశంసలు

ప్రధానితో చంద్రబాబు భేటీ సందర్భంగా ఆసక్తికర సన్నివేశం జరిగింది. టీడీపీ ఎంపీ అప్పలనాయుడిని భోగాపురం విమానాశ్రయం ఉన్న స్థానిక ఎంపీ అంటూ ప్రధాని మోదీకి ఆత్మీయంగా పరిచయం చేశారు. ‘అప్పలనాయుడు నాకు తెలుసు... ఆయన ప్రతిరోజూ సైకిల్‌పై పార్లమెంటుకు వస్తున్నారు’ అంటూ ఎంపీని ప్రధాని అభినందించారు.


కేంద్ర మంత్రులతో సమావేశాలు...

ప్రధానితో భేటీ అనంతరం కేంద్ర మంత్రి పీయుష్ గోయల్‌తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాలు పాటు జరిగిన సమావేశంలో ఏపీకి కొత్త పారిశ్రామిక ప్రాజెక్టులు, పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఆపై కేంద్ర పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సమావేశమయ్యారు.


ఇవి కూడా చదవండి..

‘పిల్లలను చదివించే ప్రతి తల్లికీ నా వందనం’: మంత్రి లోకేశ్

మంగళగిరి అభివృద్ధి కోసం చంద్రబాబుతో గొడవ పెట్టుకున్నా: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 03:08 PM