Share News

అదుపుతప్పి మూడు వాహనాలను ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. ఒకరి మృతి

ABN , Publish Date - Jul 22 , 2026 | 12:21 PM

రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి-పుప్పాలగూడ టోల్‌గేట్ వద్ద వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్.. బైక్‌ను బలంగా ఢీకొట్టింది.

అదుపుతప్పి మూడు వాహనాలను ఢీకొన్న వాటర్ ట్యాంకర్.. ఒకరి మృతి
Narsingi Accident

రంగారెడ్డి, జులై 22: జిల్లాలోని నార్సింగి-పుప్పాలగూడ టోల్‌గేట్ వద్ద వాటర్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. అతివేగంగా దూసుకొచ్చిన ట్యాంకర్.. బైక్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న సుశీల్ కుమార్(28) అనే వ్యక్తి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తి సురేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం తర్వాత అదుపు తప్పిన ట్యాంకర్ మరో కారు, స్కూటీని కూడా ఢీ కొట్టింది. దీంతో మొత్తం మూడు వాహనాలను వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. సమాచారం అందిన వెంటనే నార్సింగి పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.


ట్యాంకర్ డ్రైవర్ రంజిత్ సింహాను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. అలాగే గాయపడిన సురేష్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. సుశీల్ మృతి సమాచారాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


ఇవి కూడా చదవండి..

కొడంగల్‌లో నన్ను దెబ్బతీయాలని కుట్ర.. వాటిని తిప్పికొట్టండి: సీఎం రేవంత్

గిగ్ వర్కర్లు, డ్రైవర్లకు తెలంగాణ రక్షణ సేన అండ: కవిత

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2026 | 12:44 PM