అదనపు ఆదాయం కోసం.. ఆటోలో సైడ్ బిజినెస్.. వీడియో వైరల్
ABN , Publish Date - Jan 31 , 2026 | 01:01 PM
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు వైరల్ అవుతున్నాయి. కొంతమంది స్క్రిప్ట్ రాసి వీడియోలు క్రియేట్ చేస్తున్నారు. మరికొంత మంది ఎవరూ ఊహించని, ఆశ్చర్యకరమైన వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఓ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది.
ఇంటర్నెట్ డెస్క్: సాధారణంగా ఆటో డ్రైవర్లు ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తుంటారు. కానీ.. ఓ ఆటో డ్రైవర్ అదనపు ఆదాయం కోసం చేసిన ఐడియా అందరినీ ఆకట్టుకుంటోంది. ఇంతకీ అతను ఏం చేస్తున్నాడో అనుకుంటున్నారా? మహిళలు ధరించే ఆభరణాలను ఆటోలో అమ్ముతున్నాడు. ఫుట్ పాత్‌పై అమ్మే.. చెవి దుద్దులు, చైన్లు, నెక్లెస్‌లు తన ఆటోలో విక్రయిస్తున్నాడు. ఆ వస్తువులు ప్యాసెంజర్ సీటుకు ఎదురుగా ఉంచాడు. తక్కువ ధరకు తమకు నచ్చిన వస్తువులు లభిస్తుండటంతో మహిళలు ఆసక్తిగా వాటిని కొనుగోలు చేస్తున్నారు.
కేవలం ఆటో నడపడం ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో.. ఇంటి అవసరాల కోసం ఇలా సైడ్ బిజినెస్ ప్రారంభించాడా ఆటో డ్రైవర్. ఈ దృశ్యాలను mr_petrolholic_46 అనే ఇన్‌స్టా యూజర్ పోస్ట్ చేశారు. వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఆటో డ్రైవర్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ‘మధ్యతరగతి వ్యక్తి కుటుంబాన్ని పోషించుకోడానికి ఇలాంటి వినూత్న ఆలోచన చేయడం అందరికీ స్ఫూర్తిదాయకం’ అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇవీ చదవండి:
ఇజ్రాయెల్‌కు 6.67 బిలియన్ డాలర్ల ఆయుధాలు.. అమెరికా నిర్ణయం
భారత్‌కు వెనెజువెలా ముడి చమురు.. అమెరికా ఆఫర్