వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి

ABN, Publish Date - Nov 08 , 2026 | 07:18 AM

వికారాబాద్‌ జిల్లా, కొడంగల్‌ నియోజకవర్గం, దుద్యాల మండలం లగచర్ల-హకీంపేట హబ్‌లో మూడు రోజుల పాటు కొనసాగనున్న మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 1/23

వికారాబాద్‌ జిల్లా, కొడంగల్‌ నియోజకవర్గం, దుద్యాల మండలం లగచర్ల-హకీంపేట హబ్‌లో మూడు రోజుల పాటు కొనసాగనున్న మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను శనివారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 2/23

అలాగే, ఆదర్శ రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలతో ముఖాముఖి కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 3/23

రైతుల సమస్యలు, సాగునీటి అవసరాలు, ప్రాంత అభివృద్ధిపై సీఎం దిశానిర్దేశం చేశారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 4/23

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. అందరం కలిసికట్టుగా ఎల్‌నినోను ఎదుర్కొందామని పిలుపునిచ్చారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 5/23

సంక్రాంతి పండగ తర్వాత రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పర్యటిస్తానని సీఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. ఇందుకోసం ప్రజాబలం అని కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 6/23

సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తుండగా ఆసక్తిగా వింటున్న అన్నదాతలు

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 7/23

ఇందులో భాగంగా జిల్లాల్లో పర్యటించి ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుంటామని చెప్పారు. కరువు పరిస్థితులు ఏర్పడితే ప్రతి ఎమ్మెల్యే, మంత్రి, ప్రజాప్రతినిధి ప్రజల మధ్య ఉండాలని అన్నారు. ముఖ్యమంత్రిగా తాను కూడా ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 8/23

ప్రస్తుతం ప్రాజెక్టుల్లో ఉన్న నీళ్లు తాగునీటి అవసరాలకే సరి పోతాయని సీఎం స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ఎండలు మరింత మండిపోతాయని, నీటిని జాగ్రత్తగా వాడుకోవాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 9/23

రైతులు ఆరుతడి పంటలు వేయాలని, వేరే పంటలు వేస్తే పెట్టుబడులు కూడా చేతికందే పరిస్థితి లేదని చెప్పారు. అధిక దిగుబడినిచ్చే పంటలను ఎంచుకుని ఆధునిక సాగు పద్ధతులు పాటించాలని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 10/23

తాండూరు కందిపప్పుకు ప్రపంచస్థాయి గుర్తింపు వచ్చిందని, తాండూరు, కొడంగల్‌, పరిగి ప్రాంతాల జొన్నలు, సజ్జలు, కందులు, జొన్న రొట్టెలకు ప్రత్యేకత ఉందని, రైతులు అనుకుంటే ఏదైనా సాధించగలరని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 11/23

ఎల్‌నినోపై బీఆర్‌ఎస్‌ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రపంచవ్యాప్తంగా కరువు పరిస్థితులు నెలకొంటే ఒక్క తెలంగాణలోనే వచ్చినట్లు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 12/23

బావబామ్మర్దులు ఊర్ల మీద పడి అబద్ధాలు, అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 13/23

బీఆర్‌ఎస్‌ నేతలు పదేళ్ల పాలనలో కమీషన్లకు కక్కుర్తి పడటం వల్లే కరువు సమయంలో కాళేశ్వరం నుంచి చుక్కనీరు ఇవ్వలేని దుర్భర పరిస్థితి ఏర్పడిందని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 14/23

కేంద్రం జాతీయ ప్రాజెక్టు హోదా ఇస్తామన్నా లెక్కచేయకుండా కేసీఆర్‌ ప్రాణహిత - చేవెళ్లను పక్కనబెట్టి, పేరు, ప్రాంతం, అంచనాలు మార్చి కాళేశ్వరం కట్టారని సీఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహించారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 15/23

కాళేశ్వరం కట్టింది వాళ్లేనని.. కూలింది వాళ్ల హయాంలోనేనని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మేడిగడ్డ వద్ద ఒక్క ఎకరా ఆయకట్టు కూడా లేదని, అన్నారం, సుందిళ్ల వద్దా లేదని, మరి ఈ బ్యారేజీలు గాడిదలు కాయడానికి కట్టారా అని ప్రశ్నించారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 16/23

మూడు బ్యారేజీల్లో గేట్లు దించి, మూడు పంప్‌హౌస్‌లు ఏకకాలంలో పనిచేస్తేనే శ్రీపాద ఎల్లంపల్లి నిండుతుందని, మేడిగడ్డలో 16 టీఎంసీలు ఉంటేనే కన్నెపల్లి నుంచి ఎత్తిపోయగలమని సీఎం రేవంత్‌రెడ్డి వివరించారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 17/23

మేడిగడ్డ వద్ద ఎత్తిపోయక పోవడం వల్లే నీళ్లు ఏపీకి పోతున్నాయనే బీఆర్‌ఎస్‌ ఆరోపణలు అబద్ధమని, ఆ పార్టీ నేతలకు కనీస అవగాహన లేదని సీఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 18/23

ఆనాడు ‘కాళేశ్వర్‌రావు‘గా పొగిడించుకున్న హరీశ్‌రావు ఇప్పుడు మేడిగడ్డ పేరెత్తితే ఎందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌ హయాంలో చేపట్టిన తుపాకులగూడెం-దేవాదుల, జలయజ్ఞంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి మొదలుపెట్టిన రాజీవ్‌సాగర్‌ (ఇప్పటి సీతారామ) ప్రాజెక్టులే ఇప్పుడు లక్షల ఎకరాలకు నీరిస్తూ ఖమ్మం జిల్లా రైతులను ఆదుకుంటున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ఉద్ఘాటించారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 19/23

కాళేశ్వరం అవకతవకలపై విచారణకు ఆదేశిస్తే, సీబీఐ విచారణ జాప్యం కోసం ఢిల్లీలో మోదీ ముందు మోకరిల్లింది మీరు కాదా అని బీఆర్‌ఎస్‌ను నిలదీశారు. పదేళ్లలో రాష్ట్ర బడ్జెట్‌ రూ.20 లక్షల కోట్లకు పైగా ఉన్నా పాలమూరులో ఒక్క సాగునీటి ప్రాజెక్టూ పూర్తి చేయలేదని దుయ్యబట్టారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 20/23

ఎస్‌ఎల్‌బీసీ, డిండి, అచ్చంపేట ఎత్తిపోతలు పూర్తిచేసి ఉంటే నల్లగొండ, మహబూబ్‌నగర్‌, ఖమ్మం జిల్లాల్లో లక్షల ఎకరాలకు సాగునీరు అందేదని సీఎం రేవంత్‌రెడ్డి ప్రస్తావించారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 21/23

22ఏ భూములపై కొందరు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని, అసెంబ్లీలో చర్చకు వస్తే వాస్తవాలన్నీ ప్రజల ముందుంచుతామని సీఎం రేవంత్‌రెడ్డి సవాల్‌ విసిరారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 22/23

డిసెంబరులో రెండు, మూడు రోజుల పాటు ఎల్‌నినో, కాళేశ్వరం, ప్రాణహిత నీళ్లపై చర్చకు అవకాశం ఇవ్వాలని వేదికపై ఉన్న స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను కోరారు.

వికారాబాద్‌ జిల్లాలో మెగా రైతుమేళా, పారిశ్రామిక ప్రదర్శనను ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి 23/23

ఈ చర్చకు కేసీఆర్‌, హరీశ్‌రావు, కేటీఆర్‌ తమ తాతముత్తాతలను, చుట్టాలను వెంటబెట్టుకుని వచ్చినా అనుమతించాలని, అసెంబ్లీలోనే వాళ్ల సంగతి తేలుస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.

Updated at - Nov 08 , 2026 | 07:56 AM