మిర్యాలగూడలో సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన
ABN, Publish Date - Feb 05 , 2026 | 06:57 AM
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో పర్యటించారు. మిర్యాలగూడ నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. మిర్యాలగూడలో జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట సభకు విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు.
1/10
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం గూడూరులో పర్యటించారు.
2/10
మిర్యాలగూడలో జరిగిన ప్రజాపాలన ప్రగతిబాట సభకు విచ్చేసిన సీఎం రేవంత్‌రెడ్డి రూ.200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్‌కు శంకుస్థాపన చేశారు.
3/10
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేద పిల్లవాడికి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించే సంకల్పంతో ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 25 ఎకరాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలలను నిర్మిస్తున్నామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు.
4/10
ఇందులో భాగంగా ఈ రోజు నల్గొండ జిల్లా, మిర్యాలగూడ నియోజకవర్గ పరిధిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని సీఎం వెల్లడించారు.
5/10
రెండేళ్ల అభివృద్ధికి, పదేళ్ల అరాచకానికి మధ్య తేడాను గుర్తెరిగిన తెలంగాణ పట్టణాలు ప్రజా పాలనకు జై కొట్టడానికి ఈ రోజు ప్రజా పాలన - ప్రగతి బాట సభ నాంది పలికిందని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
6/10
ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ.1300 కోట్ల బ్యాంకు లింకేజీ చెక్కులను సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రసంగించారు.
7/10
ఈ కార్యక్రమానికి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు.
8/10
తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, ఏడు కార్పొరేషన్లలో కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.
9/10
జాతిపిత అవడానికి తెలంగాణకు మాజీ సీఎం కేసీఆర్ ఏం చేశారని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
10/10
తెలంగాణను దోచుకున్న వారు జాతిపితలు ఎలా అవుతారని ప్రశ్నించారు. చేసిన పాపానికి క్షమాపణ అడగకుండా సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారని సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Updated at - Feb 05 , 2026 | 08:08 AM