హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన పలు ప్రాంతాలు

ABN, Publish Date - Aug 23 , 2026 | 06:41 AM

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వర్షం దంచికొట్టింది. వాన పడటంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీలు నీటమునిగాయి.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన పలు ప్రాంతాలు 1/7

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో వర్షం దంచికొట్టింది. వాన పడటంతో పలు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పలు కాలనీలు నీటమునిగాయి.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన పలు ప్రాంతాలు 2/7

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి ప్రాంతంలో శనివారం వర్షం దంచికొట్టింది. ఒక్కసారిగా కురిసిన కుండపోత వానతో కూకట్‌పల్లిలోని పలు ప్రాంతాలు జలమయంగా మారాయి.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన పలు ప్రాంతాలు 3/7

భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూకట్‌పల్లి పరిధిలోని పలు కాలనీలు, ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో భారీగా వర్షపు నీరు నిలిచిపోయింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన పలు ప్రాంతాలు 4/7

కొన్ని ప్రాంతాల్లో ఇళ్ల చుట్టూ నీరు చేరడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపైకి నీరు చేరడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన పలు ప్రాంతాలు 5/7

వర్షం తీవ్రత పెరగడంతో డ్రైనేజీ వ్యవస్థపై కూడా ప్రభావం పడింది. వర్షపు నీరు సక్రమంగా వెళ్లకపోవడంతో పలు కాలనీల్లో నీరు నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన పలు ప్రాంతాలు 6/7

అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, నీటితో నిండిన రహదారుల్లో వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జలమయమైన పలు ప్రాంతాలు 7/7

భారీ వర్షం కారణంగా కూకట్‌పల్లి పరిసర ప్రాంతాల్లో సాధారణ జనజీవనం కొంతమేర స్తంభించింది. మరోవైపు వర్షపు నీటిని తొలగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టారు.

Updated at - Aug 23 , 2026 | 06:47 AM