మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్

ABN, Publish Date - Jun 25 , 2026 | 07:24 AM

రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 5 అత్యంత వైభవంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్ క్రీడారంగంలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిన ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఏపీఎల్ ట్రోఫీ, క్రీడాకారుల జెర్సీలను ఆవిష్కరించారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 1/17

రాజధాని అమరావతి పరిధిలోని మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్ 5 అత్యంత వైభవంగా ప్రారంభమైంది.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 2/17

ఆంధ్రప్రదేశ్ క్రీడారంగంలో ఒక చరిత్రాత్మక ఘట్టంగా నిలిచిన ఈ వేడుకకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిథిగా విచ్చేసి, ఏపీఎల్ ట్రోఫీ, క్రీడాకారుల జెర్సీలను ఆవిష్కరించారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 3/17

ఈ మెగా క్రికెట్ పండగలో కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), కార్యదర్శి , ఎంపీ సానా సతీశ్‌, గన్నవరం ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 4/17

టోర్నీలో భాగంగా క్యాపిటల్ అమరావతి రాయల్స్‌ వర్సెస్ భీమవరం బుల్స్ మధ్య జరిగిన తొలి మ్యాచ్‌కు రామ్‌చరణ్ టాస్ వేసి మ్యాచ్‌ను ప్రారంభించారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 5/17

యువ క్రికెటర్లకు ఆంధ్రా ప్రీమియర్‌ లీగ్‌ అనేది అద్భుత అవకాశమని రామ్‌ చరణ్‌ వ్యాఖ్యానించారు. యువ క్రికెటర్ల ప్రతిభను వెలికి తీసేందుకు ఈ లీగ్‌ ఎంతో సాయపడుతుందని అన్నారు. ఏపీఎల్‌లో పాల్గొంటున్న క్రికెటర్లందరికీ చరణ్‌ అభినందనలు తెలిపారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 6/17

యువ ప్రతిభను వెలికి తీసేందుకు ఈ లీగ్ ఒక అద్భుత ఆవకాశమని రామ్‌ చరణ్ పేర్కొన్నారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 7/17

యువ క్రికెటర్లలోని ప్రతిభను ప్రోత్సహించడానికి ఈ లీగ్ గొప్ప వేదికని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ ఆకాంక్షించారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 8/17

గతంలో నిర్లక్ష్యానికి గురైన మంగళగిరి ఏసీఏ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అభివృద్ధి చేసిందని ఏసీఏ ప్రెసిడెంట్ కేశినేని శివనాథ్ తెలిపారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 9/17

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ మంత్రి నారా లోశ్‌ల సమర్థవంతమైన నాయకత్వంలో, ఈ స్టేడియాన్ని బీసీసీఐ నిబంధనల ప్రకారం ప్రపంచస్థాయి వసతులతో అద్భుతంగా తీర్చిదిద్దారని కేశినేని శివనాథ్ వివరించారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 10/17

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన స్టేడియం గ్రాండ్‌గా ప్రారంభం కావడం విశేషమని వ్యాఖ్యానించారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 11/17

ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌తో మన రాజధాని ప్రాంతం ఇకపై అంతర్జాతీయ క్రికెట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారబోతోందని కేశినేని శివనాథ్ ధీమా వ్యక్తం చేశారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 12/17

రాజధాని అమరావతి బ్రాండ్ ఇమేజ్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్‌తో మంగళగిరి మైదానంలో మెగా పవర్ వైబ్స్ నెలకొన్నాయని శివనాథ్ పేర్కొన్నారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 13/17

ఆంధ్ర ప్రీమియర్ లీగ్‌కు భారీ సంఖ్యలో క్రీడాభిమానులు హాజరై విజయవంతం చేశారని చెప్పుకొచ్చారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 14/17

ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఏపీఎల్ 2026 లీగ్, రాష్ట్రంలో నెక్స్ట్ లెవెల్ క్రికెట్ ఫీవర్‌ను తీసుకొచ్చిందని శివనాథ్ తెలిపారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 15/17

ఈ ప్రతిష్ఠాత్మక టోర్నమెంట్‌లో పాలుపంచుకుంటున్న క్రీడాకారులందరికీ ప్రముకులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 16/17

మంగళగిరి స్టేడియంలో ఇవాళ్టి నుంచి నాలుగు రోజుల పాటు మధ్యాహ్నం, సాయంత్రం మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నెల 27న లీగ్‌ దశ ముగుస్తుంది. తర్వాతి రోజు నుంచి ప్లే ఆఫ్స్‌ ప్రారంభం కానున్నాయి.

మంగళగిరిలో క్రికెట్ జాతర.. ఏపీఎల్ ట్రోఫీ ఆవిష్కరించిన రామ్‌ చరణ్ 17/17

ఈ నెల 30న ఫైనల్‌ మ్యాచ్ జరుగుతుంది. టోర్నీలో పోటీ పడుతున్న ఏడు జట్లలో ప్రస్తుతం భీమవరం బుల్స్‌ 6 మ్యాచ్‌ల్లో 8 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతోంది. లీగ్‌ దశలో టాప్‌ 4 జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.

Updated at - Jun 25 , 2026 | 07:44 AM