ప్రధాని మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా.. మంత్రి లోకేశ్ ప్రత్యేక పూజలు
ABN, Publish Date - Oct 07 , 2026 | 05:37 PM
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఏపీ మంత్రి నారా లోకేశ్ అమరావతి వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు. మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని, ‘వికసిత్ భారత్’ సంకల్పం నెరవేరాలని ప్రార్థించారు.
1/7
ప్రధానమంత్రి నరేంద్రమోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని ఏపీ మంత్రి నారా లోకేశ్ అమరావతి వెంకటపాలెం వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం ప్రత్యేక పూజలు చేశారు.
2/7
మోదీకి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని స్వామివారిని ప్రార్థించారు.
3/7
మోదీ ఆయురారోగ్యాలతో ఉండాలని, ‘వికసిత్ భారత్’ సంకల్పం నెరవేరాలని ప్రార్థించారు.
4/7
ప్రధాని మోదీ ‘వికసిత్ భారత్’ వజ్ర సంకల్పం నెరవేరాలని ఆకాంక్షించారు. 2001 అక్టోబర్ 7వ తేదీన గుజరాత్ సీఎంగా ప్రారంభమైన మోదీ ప్రజాసేవా ప్రస్థానానికి 25 ఏళ్లు పూర్తి అయిందని లోకేశ్ తెలిపారు.
5/7
దేశ శ్రేయస్సు, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా మోదీ 25 ఏళ్ల ప్రజాసేవ కొనసాగిందని వెల్లడించారు. దేశాన్ని అన్ని రంగాల్లో ప్రపంచంలోనే నంబర్ వన్‌గా నిలపాలనే లక్ష్యంతో మోదీ కృషి చేస్తున్నారని లోకేశ్ కొనియాడారు.
6/7
నిస్వార్థంగా దేశం కోసం పనిచేస్తున్న ఆధునిక ఉక్కుమనిషి మోదీ అని ఉద్ఘాటించారు. మోదీకి పూర్తి శక్తియుక్తులు ప్రసాదించాలని వెంకటేశ్వరస్వామిని ప్రార్థించారు.
7/7
మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ యాత్ర’గా నిర్వహిస్తున్నారని వెల్లడించారు. దేశాభివృద్ధి కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషికి ‘సేవా సంకల్ప్ యాత్ర’ నిదర్శనమని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
Updated at - Oct 07 , 2026 | 06:01 PM